MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు..  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
1 min read

MSP | వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

Spread the love

MSP : కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం రైతులకు గుడ్ న్యూన్ చెప్పింది. ప్రధాని న‌రేంద్ర‌ మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కొత్త మంత్రివ‌ర్గం వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి, గోధుమ, పత్తి సహా 14 పంటలకు కనీస మద్దతు ధర ( MSP) పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆయా పంటల ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం జోడించి ఈ కొత్త‌ ధరలను నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్ల‌డించారు. దీని వల్ల ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం ఉంటుంది. గత ఏడాది కంటే రైతులకు రూ.35,000 కోట్ల లాభం చేకూర‌నుంది.

భారతదేశపు మొదటి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్

సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “భారతదేశంలోనే మొట్టమొదటి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవి 1GW ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌లు, ఒక్కొక్కటి 500 MW (గుజరాత్, తమిళనాడు తీరంలో) ఇది భారతదేశానికి గొప్ప అవకాశం. అని తెలిపారు.

మహారాష్ట్రలోని వధావన్‌లో ఆల్-వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్-డ్రాఫ్ట్ మేజర్ పోర్ట్‌ను అభివృద్ధి చేయాలనే కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహనులో, వధవన్ పోర్ట్ కోసం రూ.76,200 కోట్ల ప్రాజెక్ట్ ను కేబినెట్‌ ఆమోదించింది. ఈ పోర్ట్ 23 మిలియన్ల TU సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 298 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్ర‌యం విస్తరణ

క్యాబినెట్ నిర్ణయంపై, అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, “రూ. 2,870 కోట్లతో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం, వారణాసి విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనలో రన్‌వే పొడిగింపు, కొత్త టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మించడం వంటివి ఉన్నాయి. దీనిని ప‌ర్యావ‌ర‌ణ అనుకూలంగా మారుస్తాము.

మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ 17వ విడత పీఎం కిసాన్ నిధిని విడుదల చేసేందుకు తన మొదటి ఫైల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేశారు. మంగళవారం వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) కింద దాదాపు 9.26 కోట్ల మంది లబ్ధిదారుల రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా 17వ విడత మొత్తాన్ని 20,000 కోట్ల రూపాయలకు పైగా పిఎం మోడీ విడుదల చేసిన విష‌యం తెలిసిందే..


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *