Wednesday, April 16Welcome to Vandebhaarath

Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Spread the love

Model Schools | తెలంగాణ‌లోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది టీచర్ల చిరకాల క‌ల ఎట్ట‌కేల‌కు సాకార‌మైంది. బ‌దిలీల కోసం 11 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల వాంఛ ఫలించనుంది. మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపాళ్లు,, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2,757 మందికి త్వరలో బ‌దిలీలు చేస్తూ మోడల్స్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 2013, 2014లో మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు రెండు విడుతల్లో నియామ‌క‌మ‌య్యారు. అప్పటి నుంచి వీరికి ఒక్కసారి కూడా స్థాన‌చ‌ల‌నం క‌ల‌గ‌లేదు. దీంతో గత ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు.

READ MORE  ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

ఈ నేపథ్యంలో గ‌త సంవత్స‌రం జూలైలో మోడ‌ల్ స్కూళ్ల టీచ‌ర్ల  (Model Schools Teachers )బ‌దిలీల‌కు షెడ్యూల్‌ జారీ చేసింది. దీంతో వీరంతా వెబ్‌ ఆప్షన్లు కూడా ఇచ్చారు. అయితే సర్వీస్‌ పాయింట్ల కేటాయింపుపై కొందరు హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ విష‌యంలో కోర్టు స్టే ఇవ్వడంతో బదిలీల ప్రక్రియ అర్ధంత‌రంగా నిలిచిపోయింది. తాజాగా మెరిట్‌ ప్రకారం సీనియారిటీ జాబితా రూపొందించి ట్రాన్స్ ఫ‌ర్లు చేపట్టవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఉద్యోగాల్లో చేరిన తేదీ ఆధారంగా ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు కేటాయించాలని న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టీచర్లను ట్రాన్స్‌ఫర్స్ ను తెలంగాణ స‌ర్కారు అమ‌లు చేస్తోంది.

READ MORE  Skill University Admission | స్కిల్ యూనివ‌ర్సిటీలో అడ్మిషన్స్ షురూ..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *