Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం క‌లిపిన వ్య‌క్తి.. చిత‌క‌బాదిన స్థానికులు

Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం క‌లిపిన వ్య‌క్తి.. చిత‌క‌బాదిన స్థానికులు

Ghaziabad : ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమాని జ్యూస్‌లో మూత్రం కలిపాడు. మూత్రం ఉన్న లీటర్‌ బాటిల్‌ ఆ షాపు వద్ద క‌నిపించింది. దీనిని చూసిన స్థానికులు స‌ద‌రు షాపు య‌జ‌మానిని నిలదీసి దాడిచేశారు. అనంత‌రం పోలీసులకు అప్ప‌గించి ఫిర్యాదు చేయ‌డంతో ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమానిని అరెస్ట్‌ చేశారు. షాపులోని యూరిన్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని అమీర్ ఖాన్‌, వివిధ‌ పండ్ల రసాల్లో మూత్రం కలిపి (Mixing Urine with Juice) విక్ర‌యిస్తున్నాడు. సెప్టెంబర్ 13న బాటిల్‌లో ఉన్న పసుపు రంగు ద్రవాన్ని ఫ్రూట్‌ జ్యూస్‌లో అతడు కలపడాన్ని కొందరు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ బాటిల్‌ను పరిశీలించగా అది యూరిన్ అని స్ప‌ష్ట‌మైంది. దీంతో కంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

READ MORE  Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు

కాగా, జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న అమీర్ ఖాన్‌పై స్థానికులు ఒక్క‌సారిగా ఆగ్రహంతో అతడిపై దాడి చేశారు. ఆ షాపు వద్దకు చేరుకున్న పోలీసులకు నిందితుడిని అప్పగించారు. జ్యూస్‌ షాపు వద్ద ఉన్న మూత్రం బాటిల్‌ గురించి ఆరా తీయగా అమీర్‌ ఖాన్‌ సరిగా నీళ్లు నమిలాడు. దీంతో అతడితోపాటు సహాయంగా ఉన్న బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూత్రం బాటిల్‌ను స్వాధీనం చేసుకుని పరీక్ష కోసం పంపినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

READ MORE  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

ఈ ఘటనపై ఏసీపీ భాస్కర్ వర్మ మాట్లాడుతూ.. జ్యూస్‌లో మూత్రం కలిపినట్లు పోలీసులకు సెప్టెంబర్ 13న ఫిర్యాదు అందిందని తెలిపారు. ఇందిరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణంలో తనిఖీలు చేయగా.. లీటరు మానవ మూత్రం నింపిన డబ్బా కనిపించింది. షాపులో మూత్రం ఉందంటూ దుకాణదారుని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అని వెల్లడించారు. జ్యూస్ విక్రేత ఇంత దారుణమైన పని చేయడానికి గల కారణాలపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *