- ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకానికి కొత్త రూపం
- గ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గ్రామీణ భారతదేశ ఆర్థిక బలాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధికి హామీ కల్పించేందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) పేరు మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకానికి కొత్త పేరును ఖరారు చేసింది.
MNREGA కొత్త పేరు ఏమిటి?
MNREGA పథకాన్ని ఇప్పుడు “పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన” (PBGRY) గా పిలవనున్నారు. ఈ మార్పు గ్రామీణ ఉపాధి హామీ పథకాలపై ప్రభుత్వ దృష్టిని, ప్రాధాన్యతను మరోసారి ప్రతిబింబిస్తుంది.
కాగా MNREGA ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకాలలో ఒకటి. దీనిని 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ పథకాన్ని గతంలో కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) అని పిలిచేవారు. ఆ తర్వాత దీనికి మహాత్మా గాంధీ పేరు జోడించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) గా మార్చారు.
ఈ పథకం లక్ష్యాలు
MNREGA పథకం కింద, ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల ఉపాధిని హామీ ఇస్తుంది. కొత్త పేరుతో కూడా ఈ ప్రధాన లక్ష్యం కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం త్వరలో అధికారికంగా అమలులోకి రానుంది. ఈ పేరు మార్పుతో పథకం లక్ష్యాలు, అమలులో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


