Mahalaxmi Scheme | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్టీసీ బస్సుల్లో మెట్రోరైలు తరహాలో సీట్లు
mahalaxmi scheme : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా మొట్టమొదటసారిగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో అన్ని బస్సుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మహిళలందరూ ప్రైవేట్ వాహనాలను వదిలి బస్సులను ఆశ్రయిస్తుండటంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు పట్టేలా ఆర్టీసీ అధికారులు బస్సు సీట్లలో మార్పులు చేయాలని నిర్ణయించారు. మెట్రో రైళ్లలో మాదిరిగా సీటింగ్ అరేంజ్మెంట్ చేసేందుకు చర్యలు చేపట్టారు.
Mahalaxmi Scheme ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటే ఎక్కువ మంది జర్నీ చేయవచ్చనే ఉద్దేశంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి అదే స్థానంలో రెండు వైపులా మెట్రో రైలులో మాదిరిగా సీట్లను ఏర్పాటు చేశారు. ఫలితంగా మధ్యలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండడంతో ఎక్కువ మంది ప్రయాణించటానికి వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని బస్సుల్లో కొత్త సీటింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ కొత్త విధానం విజయవంతమైతే మిగతా అన్ని సిటీ బస్సుల్లో అమలు చేయనుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..