LPG cylinder price : ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. మోదీ సర్కారు తీపికబురు..
LPG cylinder price reduced : మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రధాని మోదీ ప్రకటించారు వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 100 వరకు తగ్గిస్తున్నట్లు వెల్లించారు. ఈ ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు వల్ల ముఖ్యంగా పేద మహిళలకు లబ్ధి చేకూర్చుతుందని తెలిపారు.
LPG gas cylinder price మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 100 తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. తాజా నిర్ణయం వల్ల దేశంలోని కోట్లాది మంది ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని, ముఖ్యంగా.. నారీ శక్తికి ఇది చాలా ప్రయోజనకరమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు మహిళల అభ్యున్నతి కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. వంట గ్యాస్ మరింత చవకగా చేయడంతో కుటుంబాల ఆరోగ్యానికి మద్దతు ఇవ్వాలనే తమ లక్ష్యం నెరవేరుతున్నదని, మహిళల అభ్యున్నతికి, సులభతర జీవితానికి తాము కట్టుబడి ఉన్నామని మోదీ తెలిపారు.
అయితే 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.
LPG gas price in Hyderabad : ఇదిలా ఉండగా ఏప్రిల్ 1 నుంచి ఉజ్వల పథకం కింద రూ. 300 గ్యాస్ సిలిండర్ సబ్సిడీని పేద మహిళలకు అందిస్తున్నట్టు కేంద్రం గురువారం వెల్లడించింది. రూ. 200గా ఉన్న 14.2 కేజీల సిలిండర్ సబ్సిడీని.. గతేడాది అక్టోబర్లో రూ. 300 లకు ( ఏడాదికి 12 ఫిల్లింగ్స్) పెంచింది. అది.. మార్చ్ 31తో ముగియనుండగా దానిని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. .
కాగా మోదీ ప్రకటనకు ముందు.. గత ఏడాది ఆగస్టు 30 నుంచి గృహ వంట గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పు లేదు. హైదరాబాద్‌లో 14.2 కిలోల సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 955 గా ఉంది. తాజా ప్రకటన తర్వాత గ్యాస్ సిలిండర్ ధర రూ. 855 లకు తగ్గనుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ ధర సరాసరిగా ఇదే విధంగా ఉంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..