Posted in

Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

EC Bans KCR Election Campaign
Spread the love

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో విలేకరుల సమావేశంలో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించి కేసీఆర్ వ్యాఖ్యలు చేశార‌ని ఈసీ పేర్కొంది.

EC Bans KCR Election Campaign : కాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిపై 48 గంటల నిషేధం బుధవారం రాత్రి 8 గంటలకు అమల్లోకి వస్తుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఏప్రిల్ 6న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు సిరిసిల్లలో తన ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అసభ్యకరమైన, అవమానకరమైన, అభ్యంతరకరమైన ఆరోపణలు చేశారని ఆరోపించారు. ఫిర్యాదును ప‌రిశీలించిన త‌ర్వాత ఈసీ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంల పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్‌ చేసింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రచారంపై నిషేధం విధించినట్లు ఈసీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *