Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..
Lok Sabha Election 2024 (Key candidates) : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి.
ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
1) బీహార్: 40 సీట్లలో 8
2) హిమాచల్ ప్రదేశ్: 4
3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3
4) ఒడిశా: 21 స్థానాలకు 6
5) పంజాబ్: 13 సీట్లలో 13
6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13
7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9
8) చండీగఢ్: 1
రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా:
1) బీహార్
నలంద (జనరల్ )
పాట్నా సాహిబ్(జనరల్ )
పాటలీపుత్ర (జనరల్)
అర్రా (జనరల్)
బక్సర్ (జనరల్)
ససారం (SC)
కరకత్ (జనరల్)
జహనాబాద్ (జనరల్)
2) హిమాచల్ ప్రదేశ్:
కాంగ్రా (జనరల్)
మండి (జనరల్)
హమీర్‌పూర్ (జనరల్)
సిమ్లా (SC)
3) జార్ఖండ్:
రాజమహల్ (ST)
దుమ్కా (ST)
గొడ్డ (జనరల్)
4) ఒడిశా:
మయూర్‌భంజ్ (ST)
బాలాసోర్ (జనరల్)
భద్రక్ (SC)
జాజ్‌పూర్ (SC)
కేంద్రపారా (జనరల్)
జగత్‌సింగ్‌పూర్ (SC)
5) పంజాబ్:
గురుదాస్‌పూర్ (జనరల్)
అమృత్‌సర్ (జనరల్)
ఖాదూర్ సాహిబ్ (జనరల్)
జలంధర్ (SC)
హోషియార్‌పూర్ (SC)
ఆనంద్‌పూర్ సాహిబ్ (జనరల్)
లూథియానా (జనరల్)
ఫతేఘర్ సాహిబ్ (SC)
ఫరీద్‌కోట్ (SC)
ఫిరోజ్‌పూర్ (జనరల్)
బటిండా (జనరల్)
సంగ్రూర్ (జనరల్)
పాటియాలా (జనరల్)
6) ఉత్తర ప్రదేశ్:
మహారాజ్‌గంజ్ (జనరల్)
గోరఖ్‌పూర్ (జనరల్)
కుషి నగర్ (జనరల్)
డియోరియా (జనరల్)
బన్స్‌గావ్ (SC)
ఘోసి (జనరల్)
సేలంపూర్ (జనరల్)
బల్లియా (జనరల్)
ఘాజీపూర్ (జనరల్)
చందౌలీ (జనరల్)
వారణాసి (జనరల్)
మీర్జాపూర్ (జనరల్)
రాబర్ట్స్‌గంజ్ (SC)
7) పశ్చిమ బెంగాల్:
డమ్ డమ్ (జనరల్)
బరాసత్ (జనరల్)
బసిర్హత్ (జనరల్)
జయనగర్ (SC)
మధురాపూర్ (SC)
డైమండ్ హార్బర్ (జనరల్)
జాదవ్‌పూర్ (జనరల్)
కోల్‌కతా దక్షిణ్ (జనరల్)
కోల్‌కతా ఉత్తర(జనరల్)
8) చండీగఢ్:
చండీగఢ్ (జనరల్)
2019 లోక్‌సభ ఎన్నికలలో మొత్తం ఓటింగ్ శాతం:
1) బీహార్: 57.33 శాతం
2) జార్ఖండ్: 66.8 శాతం
3) పంజాబ్: 65.94 శాతం
4) హిమాచల్ ప్రదేశ్: 72.42 శాతం
5) ఒడిశా: 73.29 శాతం
6) ఉత్తరప్రదేశ్: 59.21 శాతం
7) పశ్చిమ బెంగాల్: 81.76 శాతం
8) చండీగఢ్: 70.61 శాతం
2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 57 స్థానాల్లో 32 (బీజేపీ 25, జేడీయూ 3, అకాలీదళ్ 2, అప్నాదళ్ 2) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేవలం 9 సీట్లు (కాంగ్రెస్ 8, జేఎంఎం 1), ఇతర పార్టీలు 16 సీట్లు (టీఎంసీ 9, బీజేడీ 4, బీఎస్పీ 2, ఆప్ 1) గెలుచుకున్నాయి.
లోక్‌సభ ఎన్నికల 2024 దశ 7: కీలక అభ్యర్థులు (Key candidates)
వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ (బీజేపీ) వర్సెస్ అజయ్ రాయ్ (కాంగ్రెస్).
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో కాంగ్రెస్ నాయకుడు అజయ్ రాయ్‌పై పోటీ చేస్తున్నారు. ప్రధాని మోదీ 2014, 2019లో వారణాసి స్థానం నుంచి గెలిచి, ఇప్పుడు మూడోసారి బరిలో నిలిచారు. అజయ్ రాయ్ గతంలో బిజెపిలోనే ఉండగా.. 2012లో కాంగ్రెస్‌లో చేరారు.
మండిలో కంగనా రనౌత్ (బీజేపీ) వర్సెస్ విక్రమాదిత్య సింగ్ (కాంగ్రెస్).
2024 సార్వత్రిక ఎన్నికలకు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి ప్రముఖ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ పోటీకి దింపింది. దివంగత మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై కంగనపై పోటీ చేస్తున్నారు. కాగా మండి వీరభద్ర కుటుంబానికి కంచుకోటగా ఉంది. ప్రస్తుతం ఆ స్థానంలో అతని భార్య ప్రతిభా దేవి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గోరఖ్‌పూర్‌లో రవి కిషన్ (బీజేపీ) vs కాజల్ నిషాద్ (సమాజ్‌వాదీ పార్టీ)
నటుడు, రాజకీయ నాయకుడు రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్‌తో ఢీకొట్టనున్నారు. 2019లో, కిషన్ మొత్తం ఓట్లలో 60 శాతానికి పైగా SP అభ్యర్థి రాంభూల్ నిషాద్‌పై విజయం సాధించారు.
హమీర్‌పూర్‌లో అనురాగ్ ఠాకూర్ (బీజేపీ) వర్సెస్ సత్పాల్ సింగ్ రైజాదా (కాంగ్రెస్)
హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ సింగ్ రైజాదాపై పోటీ చేస్తున్నారు. ఠాకూర్ తన తండ్రి రాజీనామా తర్వాత 2008లో హమీర్‌పూర్ నుంచి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2009, 2014, 2019లో మరో మూడు ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందారు.
డైమండ్ హార్బర్‌లో అభిషేక్ బెనర్జీ (TMC).
మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ టిఎంసికి వ్యూహాత్మకంగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. సీపీఎం నుంచి ప్రతికూర్ రెహమాన్, బీజేపీకి చెందిన అభిజిత్ దాస్‌లతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..