
Mid day Meal : పేద విద్యార్థుల కడుపు నింపుతున్న అక్షయ పాత్ర
వరంగల్ లోని సర్కారు బడుల్లో పిల్లలకు రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రారంభంMid day meal by Akshsy Patra | ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు.. రుచిపచీ లేని సాంబారు నుంచి పేద విద్యార్థులకు విముక్తి లభించింది. ఇకపై ఆ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కడుపు నిండా రుచికరమై భోజనం (Mid day meal ) అందించేందుకు అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది. వరంగల్ కాశిబుగ్గలోని నరేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలతోపాటు వరంగల్ కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఈరోజు (ఆగస్టు 11)న అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ ద్వారా మధ్యాహ్నభోజన పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలోని సుమారు 757 మంది, ప్రాథమిక పాఠశాలలోని 275 మంది అలాగే కృష్ణాకాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 425 మంది పిల్లలకు రుచికరమైన భోజనాన్...