Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా
5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్,
దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. Yuva 2 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
13-మెగాపిక్సెల్ కెమెరా తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,000mAh బ్యాటరీ ని కలిగి ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Lava Yuva 2 ధర
భారతదేశంలో లావా యువ 2 ధర 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు 6,999. ఇది గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశంలోని లావా ఇ-స్టోర్ ద్వారా కొనుగోలు చేమొచ్చు.
Lava Yuva 2 Smartphone స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ (నానో) లావా యువ 2 ఆండ్రాయిడ్ 12పై నడుస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్, 269ppi పిక్సెల్ సాంద్రతతో 6.51-అంగుళాల HD+ (720×1,600 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా కోసం స్క్రీన్‌పై వాటర్‌డ్రాప్ నాచ్ ఉంటుంది. కొత్త Lava ఫోన్ 3GB RAMతో పాటు ఆక్టా-కోర్ Unisoc T606 SoC ద్వారా నడుస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా హ్యాండ్‌సెట్ 6GB వరకు RAMకి మద్దతు ఇస్తుంది.
కెమెరాల విషయానికొస్తే Lava Yuva 2 LED ఫ్లాష్‌తో 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. వెనుక కెమెరా సెటప్ HDR, పోర్ట్రెయిట్, బ్యూటీ, స్లో మోషన్‌తో సహా కెమెరా మోడ్‌లు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ఇది స్క్రీన్ ఫ్లాష్‌తో ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు పెంచుకోవచ్చు.
Lava Yuva 2లోని కనెక్టివిటీ విషయానికొస్తే 4G, బ్లూటూత్ 5, Wi-Fi, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటరీ సెన్సార్ ఉన్నాయి. లావా హ్యాండ్‌సెట్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. అలాగే ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.
Lava Yuva 2 ఫోన్ 5,000mAh బ్యాటరీతో 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ గరిష్టంగా 40 గంటల టాక్‌టైమ్‌ను, 533 నిమిషాల వరకు యూట్యూబ్ ప్లేబ్యాక్ టైమ్‌ను, ఒక్కసారి ఛార్జింగ్‌తో 600 గంటల వరకు స్టాండ్‌బై టైమ్‌ని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 164.96×76.1×8.7mm కొలతలతో, 202 గ్రాముల బరువు ఉంటుంది.