KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బస్ చార్జీల పెంచనున్న కర్ణాటక ప్రభుత్వం..!
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు ఛార్జీల పెంపును 20 శాతం వరకు ప్రతిపాదించాలని భావిస్తోంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం (Shakti scheme) కారణంగా గత మూడు నెలల్లో KSRTC రూ.295 కోట్ల మేర భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం కారణంగా NWKRTC నష్టాలను చవిచూస్తోందని NWKRTC చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ పేర్కొన్నారు. తమ సమావేశంలో బస్సు చార్జీలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్‌పర్సన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ సైతం ధ్రువీకరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య డిపార్ట్‌మెంట్‌ను నిలబెట్టుకోవడానికి టికెట్ ధరలను పెంచాల్సిన ఆవశ్యకతను వారు వివరిస్తున్నారు. గత శుక్రవారం జరిగిన బోర్డు సమావేశంలో బస్సు చార్జీలను పెంచాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేశామని శ్రీనివాస్ తెలిపారు. “బస్సు సేవలు చాలా అవసరం. బస్సు డ్రైవర్ రాకపోతే, ఒక గ్రామం రోజుకు బస్సు సర్వీస్‌ను కోల్పోవచ్చు. శక్తి పథకం వల్ల గత మూడు నెలల్లో రూ. 295 కోట్ల నష్టం వాటిల్లింది,” శ్రీనివాస్ వివరించారు.
15-20 శాతం ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించినట్లు తెలిపారు.
మరి సీఎం ఎంత వరకు ఆమోదిస్తారో చూడాలి. ఆయన పెంపును ఆమోదించకపోతే ఆర్టీసీ మనుగడ సాగించదని తెలిపారు.
నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC) చైర్మన్ రాజు కేజ్ కూడా సిద్ధరామయ్య ప్రభుత్వం ఐదు హామీలలో ఒకటైన శక్తి పథకం వల్ల వచ్చిన నష్టాలను గుర్తించారు. “మేము గత 10 సంవత్సరాలలో బస్సు ఛార్జీలను పెంచలేదు,” అని కేజ్ అన్నారు, “డిపార్ట్మెంట్ నష్టాల్లో ఉంది.. అయినప్పటికీ మేము సంస్థను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
#Karnataka likely to hike bus fares!
KSRTC proposes to hike bus fare by 15-20%..Says department incurred losses of 295 crore last quarter & hike in ticket prices will help the state’s public transport to survive
NWKRTC chairman Raju Kage claims loses due to Shakti scheme that… pic.twitter.com/T1EAjSyuyd
— Nabila Jamal (@nabilajamal_) July 14, 2024
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..