Kottankulangara Sree Devi Temple : ఈ ఆలయంలో పూజలు చేసేందుకు మగవారు స్త్రీల దుస్తులను ధరిస్తారు.. విస్తుగొలిపే ఈ ఆచారం ఎక్కడో తెలుసా.. వివరాలు..
భారత దేశం విభిన్నమైన సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం. ఒక్కో ప్రాంతంలో సంప్రదాయాలు నమ్మకాలు మరో ప్రాంతం వారికి విచిత్రంగా.. ఆసక్తికరంగా ఉంటాయి. కేరళలోని ఓ ఆలయంలో నిర్వహించే వేడుకలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. కొల్లాం జిల్లా Kollam లోని కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయం వార్షిక “చమయవిళక్కు” పండుగ Chamayavilakku Festival ను నిర్వహిస్తారు. ఇక్కడి అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనదని ప్రజలు నమ్ముతారు.ఇది మరెవ్వరికీ లేని వేడుక, ఇక్కడ పురుషులే మహిళల వేషధారణలో వచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.
కొట్టన్‌కులంగర శ్రీ దేవి ఆలయం Kottankulangara Sree Devi Temple లో చమయవిళక్కు ఉత్సవం మార్చిలో 19 రోజుల పాటు నిర్వహిస్తారు. చివరి రెండు రోజులలో మగవారు మెరిసే నగలు, అత్యంత అందంగా తమను తాము అలంకరించుకుంటారు. ఈ సమయంలో మగవారందరూ స్త్రీల మాదిరిగా తయారై పూజలు చేయడం ఇక్కడ ముచ్చటగొలుపుతుంది. వారు చీరలు కట్టుకుంటారు. నగలతో అందంగా అలంకరించుకుంటారు. మేకప్ వేసుకుంటారు. పువ్వులు ధరిస్తారు. మహిళలా కనిపించేందుకు కొందరు తమ మీసాలు, గడ్డాలు కూడా తీసేస్తారు. ఇది ఆట-నటన కాదు.. నిజమైన భక్తి, ఆరాధనతోనే చేస్తారు..
Each festival in India has unique traditions attached to it. But do you know about the ‘Chamayavilakku’ festival that takes place at Kottankulangara Sree Devi Temple in #Kerala‘s Kollam? (1/2)#AmritMahotsav #MyCultureMyPride #MainBharatHoon @KeralaTourism pic.twitter.com/yyBXqHabqY
— Amrit Mahotsav (@AmritMahotsav) April 11, 2023
Kottankulangara Sree Devi Temple పురాణ గాధ..
ఈ ప్రత్యేకమైన సంప్రదాయం వెనుక పురాణ చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం.. చాలా సంవత్సరాల క్రితం.. చిన్న గొర్రెల కాపరి బాలురు.. ఆలయ పరిసరాల్లో తమ పశువులను మేపుతూ, ఆడపిల్లలను అనుకరిస్తూ ఆటలాడుకునేవారని చెబుతారు. ఈ ఉల్లాసభరితమైన ఆటలు తరచుగా ఒక నిర్దిష్టమైన రాయి దగ్గర జరుగుతాయి. దానిని వారు పవిత్రంగా భావించేవారు. అలాంటి ఒక రోజున వారు ఆడుకునే రాయి నుంచి ఒక దేవత ప్రత్యక్షమైందని నమ్ముతారు. ఈ అద్భుత సంఘటనకు సంబంధించిన వార్తలు వేగంగా గ్రామం అంతటా వ్యాపించాయి. దీంతో ఆమె గౌరవార్థం ఒక దేవాలయం నిర్మించారు.
చమయవిళక్కు ఉత్సవాల్లో పురుషులు స్త్రీల వేషధారణతో అమ్మవారిని దర్శించుకునే సంప్రదాయం మొదలైంది. పండుగలో పాల్గొనేవారు తమతో పాటు దీపాలను వెలిగించి ఆలయానికి తీసుకువెళతారు. తెల్లవారుజామున 2 నుంచి 5 గంటల మధ్య ఈ వేడుకలకు అత్యంత పవిత్రమైన సమయంగా భావిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించే వారి కోరికలు నెరవేరుతాయని బలంగా నమ్ముతారు, ప్రతి సంవత్సరం ఈ ప్రత్యేకమైన సంప్రదాయాన్ని స్వీకరించే పురుషుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.