Saturday, April 19Welcome to Vandebhaarath

Kolkata rape-murder case live : ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మమతా బెనర్జీ

Spread the love

Kolkata rape-murder case live updates | లైవ్ టెలికాస్ట్ చేయ‌డానికి వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం అంగీక‌రిచ‌క‌పోవ‌డంతో జూనియ‌ర్ డాక్ట‌ర్లు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ కేసుపై చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) అన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ప్రభుత్వం రికార్డు చేసిన ఫుటేజీని నిరసన తెలిపిన వైద్యులతో పంచుకోవచ్చని బెనర్జీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. విధుల్లో చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ధిక్కరిస్తూ, జూనియర్ డాక్టర్లు కోల్‌కతాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ వెలుపల సిట్ నిరసనలు కొనసాగిస్తున్నారు.

READ MORE  DA Hike | ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక ..

ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అయితే “రాజకీయ శక్తులు” నిరసనలను ప్రభావితం చేయవచ్చని తెలిపారు. మ‌రోవైపు వైద్యులు సీఎం మ‌మ‌తా ఆమె వాదనలు “నిరాధారమైనవి” అని కొట్టిపారేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసనలు కొనసాగుతాయని స్ప‌ష్టం చేశారు.

ఇదిలావుండ‌గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కోల్‌కతా న‌గ‌రంలోని అనేక ప్రదేశాలలో RG కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవకలకు సంబంధించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తండ్రి సత్య ప్రకాష్ ఘోష్ నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది.

READ MORE  Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..

ప్రతిపక్షాలు.. బాధితురాలి తల్లిదండ్రుల నుంచి సాక్ష్యాలను తారుమారు చేశార‌ని, లంచం ఇచ్చేందుకు యత్నించార‌నే ఆరోపణలతో మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం కేసులో అనేక చిక్కుల‌ను తెచ్చిపెట్టింది. పోలీసు చీఫ్ వినీత్ గోయల్‌తో పాటు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తుపై సీబీఐ తాజా నివేదికను దాఖలు చేయడంతో సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టనుంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *