Friday, April 18Welcome to Vandebhaarath

సికింద్రాబాద్ స్టేషన్, చర్లపల్లి టెర్మినల్ వరకు రోడ్ల విస్తరణకు సహకరించండి..

Spread the love

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు వెళ్లే రహదారుల విస్తరణకు సహకరించాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి (Kishan Reddy) ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని కోరారు.

నగర శివార్లలోని చెర్లపల్లిలో రూ.415 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే టెర్మినల్‌ నిర్మాణం పూర్తిచేస్తున్నట్లు సోమవారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి తెలియజేశారు.. ఈ టెర్మినల్ హైదరాబాద్‌కు ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాక పోకలకు కేంద్రంగా ఉంటుందని, అందువల్ల, అటువంటి ముఖ్యమైన రైల్వే టెర్మినల్‌కు చేరుకోవడానికి ఎఫ్‌సిఐ గోడౌన్ వైపు నుండి ప్రయాణీకుల ట్రాఫిక్ కోసం 100 అడుగుల రహదారి అవసరమని ఆయన అన్నారు. టెర్మినల్‌కు వెళ్లే రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

READ MORE  Hyderabad Flights | హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా విమానాలు

అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను రూ. 715 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన రైల్వే స్టేషన్‌ను వచ్చే ఏడాది చివరి నాటికి ప్రజలకు అంకితం చేసేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే రీటిఫైల్ బస్ స్టేషన్, ఆల్ఫా హోటల్ మధ్య రోడ్డు ఇరుకుగా ఉండడంతో రద్దీ సమయాల్లో రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని నివారించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.

READ MORE  Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *