Posted in

Khel Ratna award | మను భాకర్, డి గుకేష్ లకు ఖేల్ రత్న అవార్డు.. పూర్తి జాబితా ఇదే..

Khel Ratna award
Khel Ratna award
Spread the love

Khel Ratna award | భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 సంవత్సరానికి నలుగురు క్రీడాకారులను అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేసింది. చదరంగం విభాగంలో డి.గుకేశ్ (D Gukesh ) , షూటింగ్ విభాగంలో మను బాకర్ (Manu Bhaker), హాకీ విభాగంలో హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్(Praveen Kumar) ను ఈ అవార్డులు వరించాయి.

2024-25 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Khel Ratna award ) జాబితాలో భారతదేశ డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి.గుకేష్‌లను చేర్చినట్లు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జనవరి 2న గురువారం ధృవీకరించింది. మ‌రోవైపు భారత హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా-అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశ అత్యున్నత స్పోర్టింగ్ గౌరవానికి నామినేట్ అయ్యారు. జనవరి 17, శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో క్రీడాకారుల‌కు సంబంధిత అవార్డులు ప్ర‌దానం చేసి సత్కరిస్తారు.

అర్జున్ అవార్డు గ్రహీతల జాబితా:

జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్), అన్నూ రాణి (అథ్లెటిక్స్), నీతూ (బాక్సింగ్), సావీటీ (బాక్సింగ్), వంటికా అగర్వాల్ (చెస్), సలీమా టెటే (హాకీ), ​​అభిషేక్ (హాకీ), ​​సంజయ్ (హాకీ), ​​జర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ), ​​సుఖ్‌జీత్ సింగ్ (హాకీ), ​​రాకేష్ కుమార్ (పారా-ఆర్చరీ), ప్రీతి పాల్ (పారా-అథ్లెటిక్స్), జీవన్‌జీ దీప్తి (పారా-అథ్లెటిక్స్), అజీత్ సింగ్ (పారా-అథ్లెటిక్స్), సచిన్ సర్జేరావ్ ఖిలారీ (పారా-అథ్లెటిక్స్), శ్రీ ధరంబీర్ (పారా-అథ్లెటిక్స్), ప్రణవ్ సూర్మ ( పారా-అథ్లెటిక్స్), హెచ్ హోకాటో సెమా (పారా-అథ్లెటిక్స్), సిమ్రాన్ (పారా-అథ్లెటిక్స్), నవదీప్ (పారా-అథ్లెటిక్స్), నితేష్ కుమార్ (పారా-బ్యాడ్మింటన్), తులసిమతి మురుగేషన్ (పారా-బ్యాడ్మింటన్), నిత్య శ్రీ సుమతి శివన్ (పారా-బ్యాడ్మింటన్), మనీష్ రామదాస్ (పారా -బ్యాడ్మింటన్), కపిల్ పర్మార్ (పారా-జూడో), మోనా అగర్వాల్ (పారా-షూటింగ్), రుబీనా ఫ్రాన్సిస్ (పారా-షూటింగ్), స్వప్నిల్ సురేష్ కుసాలే (పారా-షూటింగ్), సరబ్జోత్ సింగ్ (పారా-షూటింగ్), అభయ్ సింగ్ (స్క్వాష్), సజన్ ప్రకాష్ (స్విమ్మింగ్), అమన్ సెహ్రావత్ (రెజ్లింగ్).


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *