Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

Kedarnath | ఈనెల 10 నుంచి తెరుచుకోనున్న కేదార్ నాథ్ ఆలయం

Kedarnath | ఉత్తరాఖండ్‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన‌ కేదార్‌నాథ్‌ ధామ్‌లో కేదరనాథుడికి ఆదివారం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభ‌య్యాయి. ఈ నెల 10 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథుడికి ఆదివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజ‌లు జ‌రిపారు.

గత ఏడాది రికార్డు స్థాయిలో యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శించారని ఆలయ క‌మిటీ ప్ర‌తినిధులు తెలిపారు. ‘‘ఈ ఏడాది కూడా భక్తుల రద్దీ పెరిగే అవ‌కాశ‌ముంది. ముఖ్యమంత్రి పుష్కర సింగ్ ధామి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ కమిటీ యాత్రికులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు శ్ర‌మిస్తున్నాయి. ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ చేరుకుని యాత్రకు ముందస్తు ఏర్పాట్లలో నిమ‌గ్న‌మైంది.

READ MORE  బీహార్ లో దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతదేహాన్ని కెనాల్ లోపడేసిన పోలీసులు

కేదార్నాథ్ ఆలయం (Kedarnath Temple) రుద్రప్రయాగ జిల్లాలో మందాకిని నదికి సమీపంలో సముద్ర మట్టానికి సుమారు 3,500 మీటర్ల ఎత్తులో ఉంది. 2013లో సంభవించిన ఆకస్మిక వరదల కార‌ణంగా కేదార్‌నాథ్ పట్టణం పూర్తిగా మునిగిపోయింది. కాగా కేదార్‌నాథ్ భాగమైన చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను ఏటా దాదాపు ఆరు నెలల పాటు మూసివేస్తారు. శీతాకాలం (అక్టోబర్ లేదా నవంబర్) ప్రారంభంతో మూసివేస్తారు. ఈ ఏడాది మే 10న ఉదయం 6 గంటలకు బద్రీనాథ్ ధామ్ పోర్టల్స్ తెర‌వ‌నున్నారు. రాబోయే చార్ ధామ్ తీర్థయాత్ర కు సిద్ధమ‌య్యేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ధామి ఇటీవ‌ల‌ అధికారులను ఆదేశించారు. చార్ ధామ్ యాత్రలో గత ఏడాది 5.6 మిలియన్ల మంది భ‌క్తులు సంద‌ర్శించారు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. 2022లో, 4.6 మిలియన్లకు పైగా యాత్రికులు ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించారు.

READ MORE  ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *