Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి

Karnataka | కర్నాటకలో దారుణ ఘటన.. మొసళ్లతో నిండిన కాలువలోకి కన్న కొడుకును తోసేసిన తల్లి

Karnataka | క‌ర్నాక‌ట‌లో అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదంతో క్షణికావేశంలో ఓ మ‌హిళ త‌న ఆరేళ్ల కుమారుడిని మొస‌ళ్ల‌తో నిండిన కాల్వ‌లో తోసేసింది.. దీంతో ఆ బాలుడు ప్రాణాలు వ‌దిలాడు. ఛిద్ర‌మైన‌ చిన్నారి మృతదేహం సరీసృపాల దవడల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దండేలి తాలూకాలోని హలమడి గ్రామంలో గ‌త‌ శనివారం రాత్రి ఈ ఘటన జ‌రిగింది. బాలుడి మృతి కి కార‌ణ‌మైన సావిత్రి (32), ఆమె భర్త రవికుమార్ (36)పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Karnataka పోలీసుల వివ‌రాల ప్ర‌కారం.. సావిత్రి, ర‌వికుమార్ దంప‌తుల కుమారుడు వినోద్ (6) పుట్టుక‌తోనే బ‌దిరుడు. బాలుడికి మాట‌లు రావు. చెవులు విపించ‌వు. బాలుడి వైకల్యంపై దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. “శనివారం రాత్రి ఇదే విషయంపై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వాగ్వాదం పెరగడంతో, సావిత్రి తన కొడుకును రాత్రి 9 గంటల సమయంలో మొసళ్ల‌తో నిండిన కాళీ నదికి క‌నెక్ట్ అయి ఉన్న డ్రెయినేజీలో విసిరేసింది అని దండేలి రూరల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ బారకేరి తెలిపారు.ఇరుగుపొరుగు వారి సమాచారంతో అగ్నిమాపక దళం డైవర్లతో పాటు పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే చీకటిగా ఉన్నందున, బాలుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.

READ MORE  విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

నాలుగో విడతలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21% మందిపై క్రిమినల్ కేసులు.. 

ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో, త‌నికీ బృందం అప్పటికే బాలుడి కుడి చేతిని తిన్న మొసలి దవడల నుండి చిన్నారి మృతదేహాన్ని అతిక‌ష్టం మీద‌ వెలికి తీయగలిగారు. మృతదేహంపై తీవ్రగాయాలు, మొస‌ళ్లు క‌రిచిన‌ గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బాధ్యులైన బాలుడి తల్లిదండ్రుల‌పై IPC సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. “భర్త మేసన్ హెల్పర్‌గా పనిచేస్తుండగా, మహిళ హోమ్‌స్టేలో ఇంటి పనిమనిషిగా పని చేస్తుంది.” నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. “తదుపరి విచారణ జరుగుతోంద‌ని పోలీసులు తెలిపారు.

READ MORE  పదేళ్ల జైలు శిక్ష తర్వాత కూడా ఆ రేపిస్టు.. మళ్లీ మైనర్‌పై లైంగిక దాడి

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *