Friday, March 14Thank you for visiting

రూ. 599 ధరతో జియో ఎయిర్‌ఫైబర్ విడుదలైంది.. అదిరిపోయే ప్లాన్లు.. ఆఫర్లు.. 16కుపైగా ఓటీటీలు..

Spread the love

టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నజియో ఎయిర్ ఫైబర్ (jio airfiber ) వచ్చేసింది.  రిలయన్స్ సంస్థ  హైదరాబాద్,  అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, పూణెతో సహా 8 నగరాల్లో జియో ఎయిర్‌ఫైబర్‌ను ఈరోజు (సెప్టెంబర్ 19న) ఆవిష్కరించింది. గత నెలలో జరిగిన రిలయన్స్
ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య  సమావేశం (AGM) సందర్భంగా వైర్‌లెస్ ఇంటర్నెట్ సొల్యూషన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. Jio AirFiber వినియోగదారులు గరిష్టంగా 1Gbps వేగంతో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేయవచ్చు. అలాగే 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లను, 16 ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి?

ఇది 5G ఆధారిత వైర్‌లెస్ WiFi సర్వీస్.. అత్యంత వేగంతో గృహ, వ్యాపార అవసరాలకు ఇంటర్నెట్ ను అందిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేబుల్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్స్‌కు ప్రత్యామ్నాయంగా జియో కొత్తగా దీనిని తీసుకొచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జియో ఫైబర్‌తో దీన్ని పోల్చుకోవద్దు. జియో ఫైబర్ కేవలం బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందిస్తోంది. ఇది ఫైబర్ ఆప్టికల్ కేబుల్స్‌ ద్వారా ఇళ్లు, ఆఫీసులకు ఇంటర్నెట్ సేవల్ని  అందిస్తుంది.

READ MORE  BSNL Broadband : బీఎస్‌ఎన్‌ఎల్ మరో చౌకైన ప్లాన్‌.. మెరుపు వేగంతో 5000 GB డేటా!

జియో ఎయిర్‌ఫైబర్ అనేది రిలయన్స్ జియో నుంచి వచ్చిన తాజా వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్, ప్రస్తుతం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణేలలో అందుబాటులో ఉంది. ఇది వైర్‌లెస్ పరికరం. దీన్ని పవర్ సాకెట్లో పెట్టడం ద్వారా పవర్ ను అందించాల్సి ఉంటుంది. ఇది Wi-Fi హాట్‌స్పాట్‌గా పనిచేస్తుంది. జియో ప్రకారం.. ఇది టీవీ లేదా బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ప్రపంచ-స్థాయి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సర్వీస్
ద్వారా అందించబడుతుంది. జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్లు రూ.599 నుంచి ప్రారంభమవుతున్నాయి.

550 డిజిటల్ టీవీ చానళ్లు, 16 కంటే ఎక్కువ ఓటీటీలు

Jio AirFiber వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, JioCinema, SonyLIV, Voot Kids, Voot Select, Zee5తో సహా 550 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లకు, 16 కంటే ఎక్కువ OTT అప్లికేషన్‌లకు సభ్యత్వాలను పొందుతారు. ఇది ఇల్లు లేదా వ్యాపార ప్రాంగణంలో Wi-Fi హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందజేస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు, PCలు, స్మార్ట్ హోమ్ IoT పరికరాలు, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, సెట్-టాప్ బాక్స్‌లతో సహా ఎక్కువ పరికరాలను ఇంటర్నెట్ వేగంతో రాజీ పడకుండా ఏకకాలంలో కనెక్ట్ చేయవచ్చు.

READ MORE  Jio 84-day plan | ఈ రీచార్జి ప్లాన్‌తో ఉచితంగా OTT సబ్‌స్క్రిప్షన్లు

Jio ఎయిర్‌ఫైబర్ కస్టమర్‌ల కోసం ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా Wi- Fi రూటర్, 4K స్మార్ట్ సెట్-టాప్ బాక్స్, వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్‌ను అందిస్తోంది.

Jio AirFiber ప్లాన్లు ఎలా ఉన్నాయి?

Jio AirFiber తన ప్లాన్ పోర్ట్‌ఫోలియోలో ఆరు ప్లాన్‌లను కలిగి ఉంది.

ప్రైమరీ ప్లాన్లు .

  • రూ. 599 ప్లాన్: ఇందులో 30Mbps వేగంతో ఇంటర్నెట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, Zee 5, జియో సినిమా, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీలు లభిస్తాయి.
  • రూ. 899 ప్లాన్ : 100 Mbps, సోనీ లివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా, సన్ నెక్ట్స్ వంటివి వస్తాయి.
  • రూ. 1199 ప్లాన్ : 100 MBPS, ఇందులో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ + హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE 5, జియో సినిమా వంటివి ఉంటాయి. ఇలా మొత్తంగా 16కుపైగా ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి.

జియో ఎయిర్‌ఫైబర్ మాక్స్ ప్లాన్లు

  • రూ.1499 ప్లాన్: 300 Mbps తో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా, సోనీ లివ్ వస్తాయి.
  • రూ. 2499 ప్లాన్ : 500 Mbps నెట్ స్పీడ్.. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ 5 వంటి ఓటీటీలు వస్తాయి.
  • రూ. 3999 ప్లాన్ : 1 Gbpsతో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటివి వస్తాయి.
READ MORE  బడ్జెట్ ధరలోనే సరికొత్త ఫీచర్లతో Moto G35 5G ఫోన్ లాంచ్

ఈ ప్లాన్లన్నీ 6, అలాగే 12 నెలల సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయి. ప్లాన్ ధరకు GST కూడా అదనం. తొలుత ఇన్‌స్టాలేషన్ ఛార్జీల కింద రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. 12 నెలల ప్లాన్ తీసుకుంటే.. ఇన్‌స్టాలేషన్ ఛార్జీ ఉండదు.

ఎలా రీచార్జ్ చేసుకోవాలి..?

కొత్త ప్లాన్‌లు Jio.com లేదా సమీపంలోని Jio స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వాట్సాప్‌లో బుకింగ్ ప్రారంభించడానికి 60008-60008కి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా వినియోగదారులు
కనెక్షన్‌ని పొందవచ్చు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?