IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతిత‌క్కువ ధ‌ర‌లో భోజనం, స్నాక్స్.. రూ.20 నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతిత‌క్కువ ధ‌ర‌లో  భోజనం, స్నాక్స్.. రూ.20 నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

IRCTC Economy Meals | రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది.  జనరల్ క్లాస్ కోచ్‌లలో ప్ర‌యాణించేవారికి అతిత‌క్కువ ధ‌ర‌ల‌కు పరిశుభ్రమైన భోజనం, స్నాక్స్ (Economy Khana ) అందించే ఐఆర్సీటీసీ తన ప్రాజెక్టును మరిన్ని రైల్వేస్టేషన్లకు విస్తరించింది. రైళ్లు, స్టేషన్లలో ప్రయాణీకులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ‘ఎకానమీ ఖానా’ అందిస్తున్నామ‌ని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ఆహార ప‌దార్థాల‌, నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను ప‌ర్య‌వేక్షించేందుకు తాము నిరంతరం నిఘా పెడ‌తామ‌ని వారు తెలిపారు.

ఈ చొరవ ఎందుకు తీసుకున్నారు?

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. IRCTC అధికారి మాట్లాడుతూ, “మేము వేసవి కాలంలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామ‌ని అన్‌రిజర్వ్‌డ్ కంపార్ట్‌మెంట్లలో ప్రయాణించే వారు ఎదుర్కొంటున్న సమస్యలను మేం అర్థం చేసుకున్నామ‌ని తెలిపారు. వారికి ఎల్లప్పుడూ పాకెట్- ఫ్రెండ్లీ మీల్స్‌, టిఫిన్స్, స్నాక్స్‌ ను అందుబాటులో ఉండాల‌ని అనుకుంటున్నామ‌నితెలిపారు.

READ MORE  Sports University | తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. !

కౌంటర్లలో ఏమున్నాయి..?

IRCTC Economy Meals : ఎకానమీ మీల్స్, స్నాక్ మీల్స్. రైలులో ప్రయాణంలో ఉన్న ప్రయాణీకులకు ఎకానమీ మీల్స్ సంతృప్తికరమైన ఎంపికలను అందిస్తాయి, అయితే స్నాక్, మీల్స్ తేలికపాటి భోజనం అవసరమైన వారికి రూ. 20 నుంచి రూ. 50 ధ‌ర‌ల్లో అందుబాటులో ఉన్నాయి. .
దీనిపై మ‌రో అధికారి మాట్లాడుతూ, ఎనాన‌మీ మీల్స్ కోసం ప్లాట్‌ఫారమ్‌లలోని అన్‌రిజర్వ్డ్ కంపార్ట్‌మెంట్‌ల వ‌ద్ద ఉండే కౌంటర్‌లలో అందుబాటులో ఉంటుంద‌ని, ఈ కౌంట‌ర్ల‌లో భోజనం, టిఫిన్స్‌, నీరు కొనుగోలు చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

READ MORE  దేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే  రైలు ఇదే.. 111 స్టేషన్లలో హాల్టింగ్..   

SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

ఏయే స్టేష‌న్ల‌లో అందుబాటులో ఉన్నాయి?

గతేడాది 51 రైల్వే స్టేషన్లలో ఈ సేవ అందుబాటులోకి వచ్చింది. ఇది విజయవంతమైన తర్వాత, ఇది ఇప్పుడు 1oo రైల్వే స్టేషన్లకు విస్త‌రించింది. ప్ర‌స్తుతం హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోనే, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ వంటి కొన్ని ప్ర‌ముఖ‌ స్టేషన్లు ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చాయి.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

One thought on “IRCTC Economy Meals | రైల్వే ప్రయాణీకులకు అతిత‌క్కువ ధ‌ర‌లో భోజనం, స్నాక్స్.. రూ.20 నుంచి ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *