న్యూఢిల్లీ: గాజాపై భూ దండయాత్రకు ఇజ్రాయెల్ (Israel) సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. పాలస్తీనియన్లపై దురాక్రమణలకు తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిస్తూ గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాలస్తీనా మీద దాడిలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చినందుకు యునైటెడ్ స్టేట్స్ తీరును కూడా తప్పుబట్టింది. ఇజ్రాయెల్ దురాక్రమణలు ఆగకపోతే, ఈ ప్రాంతంలోని అన్ని పార్టీల చేతులు ట్రిగ్గర్‌పై ఉన్నాయి” అని ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ వార్తా సంస్థ రాయిటర్స్ కు వెల్లడించారు.
గాజా(Gaza)పై నిరంతర ఇజ్రాయెల్ బాంబు దాడిలో 700 మంది చిన్నారులతో సహా 2,670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన కోస్టల్ ఎన్‌క్లేవ్‌కు నీరు, విద్యుత్, ఆహారాన్ని నిలిపివేసింది. కానీ నిన్న దక్షిణ ప్రాంతానికి నీటిని పునరుద్ధరించింది.
ఇరాన్( Iran) విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, “పరిస్థితిని నియంత్రించడానికి.. సంఘర్షణలను పెరగడానికి ఎవరూ హామీ ఇవ్వలేరు” అని అమిరాబ్డోల్లాహియాన్ అన్నారు. “యుద్ధం సంక్షోభం విస్తరించకుండా నిరోధించడానికి, అలాగే గాజాలో పౌరులపై ప్రస్తుత అనాగరిక దాడులను నిరోధించాల్సిన అవసరం ఉంది.” అని పేర్కొన్నారు.
US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ వాషింగ్టన్‌లో తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌లో యుద్ధం తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని, ఇజ్రాయెల్ దీర్ఘకాల ప్రత్యర్థి.. హమాస్ మద్దతు ఇస్తున్న ఇరాన్ కూడా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనే అవకాశం గురించి చర్చించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.