అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్లు విలువైన 2కిలోల 380 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు, రూ.5.20 లక్షల విలువైన 14 గంజాయి ప్యాకెట్లు, పిస్టల్, కారు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు రూ.5వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి(ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్), కపిల్ జాటోవు (మీరట్), మహ్మద్ షరీఫ్ (ఘజియాబాద్), ఎండి జాద్ ఖాన్(ఘజియాబాద్) ఉన్నారు. అరెస్టు వివరాలను వరం గల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న వరంగల్ మట్టెవాడ, హన్మకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్ మెంట్లో తాళం వేసిన ఉన్న 8 ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను దుండ గు లు చోరీ చేశారు. ఈ ఘటనలపై అప్రమత్తమైన వరంగల్ పోలీసులు సీపీ అదేశాల మేరకు డీసీపీ క్రైమ్స్ దాసరి మురళీధర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు.
వరంగల్ లో వరుస చోరీలకు ముందు రోజు ఆదిలా బాద్, మరుసటి రోజు బెంగూళూర్ లో ఇదే తరహా చోరీ లు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వరంగల్, ఆదిలాబాద్, బెంగుళూర్ లలో చోరీలు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాల్లో నిందితులు వినియోగించిన కారు ఫొటోలను సేకరించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలులో ఇదే తరహాలో గత మేలో చోరీలు జరగగా, నిందితులను కర్నూలు పోలీసులు అరెస్టు చేసి జైలు పం పినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అరె స్టు చేసిన కర్నూలు ఇన్ స్పెక్టర్ శంకరయ్యతో పాటు స్టేష న్ సిబ్బంది సహకారం తీసుకోవడంతోపాటు వారిని కూ డా ప్రత్యేక దర్యాప్తు బృందంలోకి చేర్చుకున్నారు. వరంగల్ పోలీసులు తమ టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకోనేందుకు వేట సాగించారు. ఈ క్రమంలో బుధవారం సుబేదారి పీఎస్ పరిధిలోని తెలంగాణ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న వెర్నా కారును ఆపి తనిఖీ చేస్తుండగా కారులోని అనుమానితులు తప్పించుకునేందుకు యత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

READ MORE  Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు

పలుమార్లు జైలుకెళ్లినా మార్పు లేదు..

నిందితులు నలుగురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఘజియాబాద్, మీరట్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. వీరందరు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి అపార్ట్మెంట్లల్లో తాళం వేసివున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలు చేసి పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలైన ఈ ముఠా సభ్యులు మళ్లీ చోరీలకు సిద్ధపడ్డారు. ఈనెల 3న ముఠా సభ్యులు కారులో ఢిల్లీ నుంచి బయలు దేరి 4న ఆదిలాబాద్ లో రెండు అపార్ట్మెంట్లల్లో చోరీ చేశారు. 5న వరంగల్ మట్టేవాడ పీఎస్ పరిధిలో 3, హను మకొండ పీఎస్ పరిధిలో 4, సుబేదారి పీఎస్ పరిధిలో 3 చోరీలకు పాల్పడ్డారు. వద్దిరాజు అపార్ట్మెంట్ లోనికి ప్రవేశిస్తుండగా నిందితులను వాచ్ మెన్ అడ్డగించగా నింది తులు తుపాకీతో బెదిరించారు. ఇక్కడ చోరీలు చేసిన ముఠా సభ్యులు కారులో బెంగుళూరు వెళ్లి నాలుగు చోరీల కు పాల్పడి హైదరాబాద్ లో జల్సాలు చేశారు. అక్కడితో ఆగకుండా ములుగు ప్రాంతంలో 104 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. ఢిల్లీలో ఎక్కువ ధరకు విక్రయించాలని అనుకున్నారు. నిందితులు తిరిగి ఢిల్లీకి వెళ్లే క్రమంలో సుబేదారి పొలీసులకు చిక్కారు. ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర ముఠా ఇప్పటివరకు మొత్తం 16 చోరీలకు పాల్పడగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది చోరీలు చేశారు. గతంలోను ఈ ముఠా 30 చోరీలకు పాల్పడింది.

READ MORE  రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *