Indian Railways | వేసవిలో ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు..
Indian Railways | వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా భారతీయ రైల్వే ఎన్నడూ లేనంతగా అత్యధిక సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈసారి మంత్రిత్వ శాఖ రైళ్ల ట్రిప్పుల సంఖ్యను ఏకంగా 43 శాతానికి పైగా పెంచింది. భారతీయ రైల్వేలు వేసవి కాలంలో రికార్డు స్థాయిలో 9, 111 ట్రిప్పులను నిర్వహిస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 వేసవితో పోలిస్తే భారీ సంఖ్యలో పెంచామని తెలిపింది.
కీలకమైన గమ్యస్థానాలను అదనపు రైళ్లు
మంత్రిత్వ శాఖ ప్రకారం, అదనపు రైళ్లను దేశవ్యాప్తంగా కీలకమైన గమ్యస్థానాలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. 9,111 రైలు ట్రిప్పులలో పశ్చిమ రైల్వే అత్యధిక సంఖ్యలో 1,878, నార్త్ వెస్ట్రన్ రైల్వే 1,623 ట్రిప్పులను నిర్వహిస్తుంది. ఇతర రైల్వే జోన్‌లు, దక్షిణ మధ్య రైల్వే (1,012 ట్రిప్పులు), తూర్పు మధ్య రైల్వే (1,003) సంఖ్యలో ట్రిప్పులను నడుపుతోంది.
“తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి వేసవి ప్రయాణ రద్దీని తీర్చడానికి భారతదేశం అంతటా ఉన్న అన్ని జోనల్ రైల్వేలు ఈ అదనపు ట్రిప్పులను నడిపించేందుకు సన్నద్ధమయ్యాయని ని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
రైళ్ల డిమాండ్ ఎలా కనిపెట్టారు.. ?
రైలు ట్రిపులను పెంచే ముందు రైళ్ల డిమాండ్‌ను అంచనా వేయడానికి PRS సిస్టమ్‌లోని వెయిట్‌లిస్ట్ ప్రయాణికుల వివరాలతో పాటు మీడియా నివేదికలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, రైల్వే ఇంటిగ్రేటెడ్ హెల్ప్‌లైన్ నంబర్ 139 వంటి అన్ని కమ్యూనికేషన్ ఛానెల్‌ల నుండి 24x 7 ఇన్‌పుట్‌లను మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది. ఒక నిర్దిష్ట మార్గంలో. “అవసరాన్ని బట్టి రైళ్ల సంఖ్య, ట్రిప్పుల సంఖ్య పెంచుతోంది రైల్వేశాఖ. సీజన్‌లో రైళ్ల సంఖ్య లేదా అదనపు రైళ్ల ద్వారా నడిచే ట్రిప్పుల సంఖ్య స్థిరంగా ఉండదు” అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read : మీరు AC లేకుండా హీట్‌వేవ్‌ను తట్టుకోవచ్చా..? ఈ చిట్కాలు పాటించండి..
వేసవి కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో తప్పనిసరిగా తాగునీటి వసతి కల్పించాలని మంత్రిత్వ శాఖ జోనల్ రైల్వేలను ఆదేశించింది. “అన్ని ప్రధాన, ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో విస్తృతమైన క్రౌడ్ కంట్రోల్ ఏర్పాట్లు చేయబడ్డాయి. క్రమపద్ధతిలో రద్దీని నియంత్రించడానికి అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సీనియర్ అధికారులు ఈ స్టేషన్లలో ఉన్నారు, ”అని మంత్రిత్వ శాఖ తెలిపింది. Indian Railways
ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద రద్దీని నియంత్రించాలి
ప్రయాణికులు పోటెత్తిన సమయంలో తొక్కిసలాట వంటి పరిస్థితులను నివారించడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వద్ద Indian Railways ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బందిని మోహరించాలని మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “Indian Railways | వేసవిలో ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు..”