
Indian Railways | భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల (Senior Citizens )కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు లోయర్ బెర్త్‌లకు అర్హులు. అలాగే కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌ను పొందే అవకాశాలను పొందవచ్చు.
సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా ఈ సౌకర్యాలను పొందవచ్చు, ఫలితంగా వారు సాఫీగా గమ్యస్థానాలను చేరవచ్చు. అయితే, సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా గరిష్టంగా ఇద్దరు వ్యక్తులతో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తున్నట్లయితే, లోయర్ బెర్త్ ప్రాధాన్యత హామీ ఉండదు. సీనియర్ సిటిజన్‌కు ఎగువ లేదా మధ్య బెర్త్ కేటాయిస్తే, టిక్కెట్ తనిఖీ సిబ్బంది ప్రయాణ సమయంలో అందుబాటులోకి వస్తే వారిని దిగువ బెర్త్‌కు మార్చవచ్చు.
చాలా మంది తరచుగా ఈ విషయాలను మర్చిపోతారు .ఫలితంగా లోయర్ బెర్త్ అవకాశాలు కోల్పోతారు. టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు, సీనియర్ సిటిజన్ రాయితీ ఆప్షన్ ఎంచుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. IRCTC వెబ్‌సైట్, ఇతర టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది.
అలాగే చిన్న వయస్సున్న ప్రయాణీకులతో పాటు టిక్కెట్లను బుక్ చేసుకోవడం వల్ల లోయర్ బెర్త్ పొందే అవకాశం తగ్గుతుంది. బుకింగ్ సమయంలో సరైన వయస్సు నమోదు చేశామని నిర్ధారించుకోండి, ఏదైనా లోపం జరిగితే సీనియర్ సిటిజన్ (Senior Citizens) కోటా ప్రయోజనాలను పొందలేం. భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం అనేక సౌకర్యాలను అందిస్తుంది. సీనియర్ సిటిజన్ కోటా కింద లోయర్ బెర్త్‌లతోపాటు రైల్వేలు సీనియర్ ప్రయాణికులకు సహాయం చేయడానికి వీల్‌చైర్లు, ర్యాంప్‌లు, స్టేషన్‌లలో ప్రత్యేక కౌంటర్‌లను అందిస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..