Video | విస్తారమైన వర్షాలతో ఆనందంతో వరదనీటిలో స్టెప్పులు వేసిన రైతన్న..
India weather | భారీ వర్షాలతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఉపశమనంతోపాటు విపత్తు రెండింటినీ తీసుకువచ్చాయి. తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి, పలుచోట్ల వ్యవసాయ భూములు నీట మునిగాయి.
అయితే గుజరాత్ లోని కుత్బుల్లాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు వరంగా మారాయి. ఏళ్ల తరబడి కరువు కాటకాలతో విలవిలలాడిన ఈ ప్రాంతం ఎట్టకేలకు భారీ వర్షాలతో తడిసిన భూమిని చూస్తోంది. ఈ ఆకస్మిక పరిణామం స్థానిక రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలో ఓరైతు తన కొడుకుతో కలిసి డాన్స్ చేసిన దృశ్యాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
సంప్రదాయ దుస్తులు ధరించి, తెల్లటి ధోతీలో రైతు, అతని కుమారుడు నల్ల టీ షర్టు, ప్యాంటుతో వరద నీటిలో స్టెప్పులు వేస్తూ కనిపించారు. సాంప్రదాయ గుజరాతీ పాటకు వీరింద్దరూ ఉత్సాహంగా డాన్స్.. చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ లు ఆన్‌లైన్‌లో క్షణాల్లోనే వైరల్ అయింది. వీరి డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నాయి.
The father and son demonstrated their joy by performing a traditional dance in a field, as the semi-arid region of Kutch experienced substantial rainfall.#Gujarat #Monsoon pic.twitter.com/HTPTJ2D8Qr
— Ronak Gajjar (@ronakdgajjar) July 23, 2024
Gujarat Rains : రైతు.. అతని కొడుకుల నృత్యం కేవలం వారిద్దరి సంతోషమే కాదు.. సమాజానికి ప్రతిబింబం కూడా. కొన్నేళ్లుగా, కచ్‌లోని రైతులు నీటి కొరతతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రాంతంలో ఒక చిన్న డ్యామ్ తరచుగా అడుగంటిపోతోంది. అయితే ఈ ఏడాది వర్షాలకు డ్యాం నిండడంతో సాగుభూముల్లోకి నీరు చేరుతోంది. భారీ వర్షాలు రాబోయే నెలల్లో రైతులకు సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉండనుంది. నీటి కొరత గురించి గతంలో ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..