Home » Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..
Refined Fuel

Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..

Spread the love

న్యూఢిల్లీ: బ్రిక్స్‌లో సభ్యదేశమైన భారత్, సౌదీ అరేబియాను అధిగమించి యూరప్‌కు శుద్ధి చేసిన ఇంధనాన్ని(Refined Fuel)  సరఫరా చేసే అగ్రదేశంగా అవతరించినట్లు ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ (Kpler) నివేదించింది. రష్యా చమురుపై కొత్త పాశ్చాత్య ఆంక్షల నేప‌థ్యంలో భారతదేశం నుంచి యూరప్ కు (European Union ) శుద్ధి చేసిన చమురు దిగుమతులు రోజుకు 360,000 బ్యారెల్స్ దాట‌నుంద‌ని అంచనా వేసింది.

సౌదీ అరేబియా ప్రపంచంలోని ప్రముఖ చమురు ఉత్పత్తిదారులలో ఒకటి గా ఉంది. దశాబ్దాలుగా చమురు వ్యాపారంలో ఏక‌చ‌త్రాదిప‌త్యాన్ని కొనసాగిస్తోంది. అయినప్పటికీ, యూరోపియన్ మార్కెట్ నుంచి రష్యా నిష్క్రమించడంతో, యూర‌ప్ దేశాలు తన ఇంధన సరఫరా కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి.

READ MORE  Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా

రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ముందు, ఐరోపా భారతీయ రిఫైనర్ల నుంచి రోజుకు సగటున 154,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 5న యూరోపియన్ యూనియన్.. రష్యన్ చమురుపై నిషేధాన్ని అమలు చేసిన తర్వాత ఈ సంఖ్య రోజుకు 200,000 బ్యారెళ్లకు పెరిగింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భారతదేశం.. రష్యా చమురు దిగుమతులు రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లను అధిగమించవచ్చని Kpler అంచనా వేసింది,

ప్రముఖ చమురు సరఫరాదారుగా భారత్

ఐరోపా దేశాలతో సంబంధాలను పెంపొందించడం, భారత్‌ను ఆధారపడదగిన ఇంధన భాగస్వామిగా ఉంచడంపై ప్రధాని మోదీ దృష్టి సారించారు. ఇంధన వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ద్వైపాక్షిక చర్చల్లో ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ చురుకుగా పాల్గొన్నారు.

READ MORE  TGSRTC: ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. ఈ రెండు రూట్లలో కొత్త బస్సు స‌ర్వీసులు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..