Refined Fuel | చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియాను అధిగమించిన భారత్..
న్యూఢిల్లీ: బ్రిక్స్‌లో సభ్యదేశమైన భారత్, సౌదీ అరేబియాను అధిగమించి యూరప్‌కు శుద్ధి చేసిన ఇంధనాన్ని(Refined Fuel) సరఫరా చేసే అగ్రదేశంగా అవతరించినట్లు ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ కెప్లర్ (Kpler) నివేదించింది. రష్యా చమురుపై కొత్త పాశ్చాత్య ఆంక్షల నేపథ్యంలో భారతదేశం నుంచి యూరప్ కు (European Union ) శుద్ధి చేసిన చమురు దిగుమతులు రోజుకు 360,000 బ్యారెల్స్ దాటనుందని అంచనా వేసింది.సౌదీ అరేబియా ప్రపంచంలోని ప్రముఖ చమురు ఉత్పత్తిదారులలో ఒకటి గా ఉంది. దశాబ్దాలుగా చమురు వ్యాపారంలో ఏకచత్రాదిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయినప్పటికీ, యూరోపియన్ మార్కెట్ నుంచి రష్యా నిష్క్రమించడంతో, యూరప్ దేశాలు తన ఇంధన సరఫరా కోసం కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నాయి.రష్యా-ఉక్రెయిన్ వివాదానికి ముందు, ఐరోపా భారతీయ రిఫైనర్ల నుంచి రోజుకు సగటున 154,000 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. ఫిబ్రవరి 5న యూరోపియన్ యూన...