Independence Day 2024 | జాతీయ జెండాను సరిగ్గా ఎగురవేయడం ఎలా? చేయవలసినవి చేయకూడనివి తప్పకుండా తెలుసుకోండి..
Independence Day 2024 | యావత్ భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపునేందుకు సిద్ధమైంది. ఈ సంవత్సరం వేడుకల థీమ్-వికసిత్ భారత్. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దేశం లక్ష్యాన్ని గుర్తుచేస్తుంది. స్వాతంత్ర్య ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా అందరూ జాతీయ జెండాను ఎగురవేస్తారు. భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్ర్య సమరయోధులను గర్తుచేసుకుని వారికి ఘనంగా నివాళులర్పిస్తారు.
మన జాతీయ జెండా ఎంతో చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. భారతీయ త్రివర్ణ పతాకం మూడు సమాంతర చారలను కలిగి ఉంటుంది: పైభాగంలో కాషాయం, మధ్యలో తెలుపు, దిగువన ఆకుపచ్చ, మధ్యలో నీలిరంగులో అశోక చక్రం ఉంటుంది.
ప్రతి రంగు, చిహ్నం ముఖ్యమైన విలువలను సూచిస్తుంది: కాషాయ రంగు ధైర్యానికి, త్యాగాన్ని సూచిస్తుంది; తెలుపు శాంతి,స్వచ్ఛతను సూచిస్తుంది. ఆకుపచ్చ పెరుగుదల, శ్రేయస్సును సూచిస్తుంది. ఇక అశోక చక్రం శాశ్వతమైన జీవిత చక్రం, ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది.
జాతీయ జెండా నిబంధనల ప్రకారం.. సరగ్గా ఉందని నిర్ధారించుకోవడానికి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS), ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. జాతీయ జెండాను సరిగ్గా ఎగురవేయడం నుంచి దానిని భద్రపరచడం వరకు ప్రతీఒక్కరు తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
చేయవలసినవి:
- భారతీయ చట్టం ప్రకారం జాతీయ జెండాను ఎల్లవేళలా “గౌరవంతో, విధేయతతో” చూడాలి. The Emblems and Names (Prevention of Improper Use) Act, 1950 స్థానంలో వచ్చిన జాతీయపతాక నియమావళి – 2002 పతాకం వాడకం, ప్రదర్శనలకు సంబంధించిన కీలకమైన నియమాలను జారీ చేసింది.
- పౌరులు, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ, తగిన అన్ని సందర్భాలలో ప్రదర్శించేలా ప్రోత్సహిస్తారు.
- గౌరవ భావంతో జెండాను ఎగురవేయండి. పైన కాషాయం రంగు మరియు దిగువన ఆకుపచ్చ రంగు ఉండేలా ఎగురవేయాలి.
- పతాకాన్ని ఉపయోగించనపుడు జెండాను త్రిభుజాకారంలో చక్కగా మడిచి, జాగ్రత్తగా భద్రపరచాలి.
- త్రివర్ణ పతాకాన్ని అన్నింటికంటే ఉన్నత స్థానంలో ఎగురవేయాలని గుర్తుంచుకోండి.. ఇతర జెండాల కంటే అత్యున్నత జెండాగా ఉండాలి.
- నాణ్యతతో తయారు చేసిన జెండాలను మాత్రమే ఉపయోగించండి.
- జెండాను ఎగురవేసేటప్పుడు, దించేటప్పుడు, సరైన ప్రోటోకాల్‌ను అనుసరించి నమస్కారం చేయండి.
- స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవంతో సహా ముఖ్యమైన జాతీయ, సాంస్కృతిక సందర్భాలలో జెండాను ఎగురవేయండి.
చేయకూడనివి:
- Independence Day : జాతీయ జెండాను దుస్తులుగా, అలంకరణగా లేదా డ్రేపరీగా ఉపయోగించవద్దు. టేబుల్‌క్లాత్‌లు లేదా రుమాలు వంటి వస్తువులపై దీన్ని ఎట్టిపరిస్థితుల్లో వాడొద్దు. విగ్రహాల మీద, ఇతర వస్తువుల మీద కప్పరాదు. 2005 వరకు దుస్తులపై, యూనిఫారాల్లో జెండాను వాడడం నిషేధం అమలులో ఉండేది. కానీ 2005-07-05 న సవరించబడిన నియమావళి ప్రకారం దుస్తులపై , యూనిఫారాలపై జెండాను వాడవచ్చు. అయితే నడుము కింది భాగంలో, లోదుస్తులపై ఎట్టిపరిస్థితుల్లో వాడవద్దు. జెండాను చేతిరుమాళ్ళమీద ఎంబ్రాయిడర్ చేయడం కూడా నిషిద్ధమే…
- జెండాను నేలను లేదా నీటిని తాకనివ్వకుండా చూడాలి. పతాకం గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉపయోగించవద్దు.
- త్రివర్ణ పతాకం కంటే ఏ ఇతర జెండా లేదా వస్తువును పైన ఉంచలేదని నిర్ధారించుకోండి. అపవిత్రం లేదా వికృతీకరణకు దారితీసే విధంగా జెండాను ఉపయోగించడం మానుకోండి.
- రంధ్రాలు పడిన లేదా దెబ్బతిన్న లేదా వెలిసిపోయిన జెండాను ఎగురవేయవద్దు.
- జెండాకు ఎలాంటి నినాదాలు, పదాలు లేదా డిజైన్‌లు వేయొద్దు..
- జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎగురవేయాలి. అననుకూల వాతావరణ పరిస్థితుల్లో దానిని ప్రదర్శించకూడదు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..