Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు
లోక్‌సభ ఎన్నికల వేళ.. వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్‌డేట్..!
Telangana Rains | లోక్ సభ ఎన్నికల వేళ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రాష్ట్రంలో రాగల నాలుగు రోజులు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad ) ఆదివారం తెలిపింది. రాష్ట్రంలో పార్లమెంట్ నాలుగో విడుత ఎన్నికలు (Loksabha Elections 2024) జరుగనున్నాయి. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సైతం ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే..
కాగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదరు గాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Telangana Rains Report : ఇక ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపే, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈనెల మంగళవారం వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే బుధ, గురువారాల్లోనూ తెలంగానలోని పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..