
Hydra | హైదరాబాద్ లో హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మరింత ముమ్మరం చేసింది. హైడ్రా దూకుడు కొనసాగుతోంది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, జిల్లాల పరిధిలో అక్రమ కట్టడాలను నేలమట్లం చేస్తోంది. కాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనుమతులు లేకుండా భారీ విల్లాలు నిర్మించారు.దీంతో ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ విల్లాలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఇదిలా ఉండగా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలోని ఆక్రమణలను హైడ్రా నేలమట్టం చేసింది. ఈ చెరువు 26 ఎకరాల్లో విస్తరించి ఉండగా దీని పరిధిలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో వెలిసిన షెడ్లు, భవనాలను హైడ్రా బుల్ డోజర్ కూల్చివేసింది. ఎఫ్‌టీఎల్‌లోని సర్వే నంబర్లు 12, 13, 14, 16లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరధిలోని హెచ్‌ఎంటీ కాలనీ, వాణి నగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.
ఇదిలావుండగా సీనియర్ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) కు చెందిన జయభేరీ కన్‌స్ట్రక్షన్స్‌కు హైడ్రా ( Hydra) నోటీసులు అందజేసింది. భాగ్యనగరంలోని మియాపూర్ హెచ్ఎంటీ హిల్స్ స్వర్ణపురిలో.. కత్వ చెరువు లక్ష్మీ కన్‌స్ట్రక్షన్స్‌లో కూల్చివేతలు చేపట్టింది అలాగే. స్వర్ణపురిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా నేలమట్టం చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..