Tuesday, April 15Welcome to Vandebhaarath

Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కుల‌కు చెల్లు..

Spread the love

Hyderabad News : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో న‌గ‌ర‌వాసుల‌కు ట్రాఫిక్ చిక్కుల‌ను దూరం చేయ‌డానిక ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. న‌గ‌రంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్‌ సీఐటీఐ (HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ (GHMC) ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రెండు ప్యాకేజీలుగా ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయ‌నున్నారు.

మొదటి ప్యాకేజీలో రూ. 421 కోట్లతో జూబ్లీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ జంక్షన్‌, కేబీఆర్‌ ఎంట్రన్స్ జంక్షన్‌, రెండో ప్యాకేజీలో రూ. 405 కోట్లతో రోడ్డు నెంబ‌ర్‌. 45 , ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్, మహారాజా అగ్రసేన్‌ జంక్షన్, క్యాన్సర్‌ అస్పత్రి జంక్షన్లను జీహెచ్‌ఎంసీ అభివృద్ధి చేయనుంది.
ఇందు కోసం ప్రణాళికను రూపొందించారు.

READ MORE  Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

KBR Park చుట్టూ ఉన్న ఆరు ప్రధాన జంక్షన్‌లను గుర్తించింది . మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అనుసంధానించే రహదారుల్లో వ్యాపార, వాణిజ్య ప్రయాణాలతో ఈ జంక్షన్లు ఇప్పుడూ కిట‌కిట‌లాడుతుంది. . ప్రస్తుతం ఈ జంక్షన్లు ట్రాఫిక్ సిగ్నల్స్, యు-టర్న్లతో పనిచేస్తున్నాయని GHMC అధికారులు తెలిపారు. ఈ జంక్షన్ల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లలో రెండు ప్యాకేజీలుగా రూ.826 కోట్లతో గ్రేడ్ సెపరేటర్లను ప్రతిపాదించినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

ప్యాకేజీ-I (రూ. 421 కోట్లు)

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్:

  • రోడ్ నెం-45 నుండి KBR, అలాగే యూసుఫ్‌గూడకు Y షేప్ అండర్‌పాస్
  • KBR పార్క్ ప్రవేశ జంక్షన్ నుంచి రోడ్ నెం 36 వైపు 4 లేన్ ఫ్లైఓవర్
  • యూసుఫ్‌గూడ వైపు నుంచి రోడ్ నంబర్ 45 జంక్షన్ వైపు 2 లేన్ ఫ్లైఓవర్
READ MORE  Goa Train | సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం  

KBR ఎంట్రీ, ముగ్ధా జంక్షన్:

  • జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్
  • పంజాగుట్ట వైపు నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు 3 లేన్
  •  KBR ప్రవేశ జంక్షన్ నుంచి పంజాగుట్ట వైపు 3 లేన్ల అండర్ పాస్

ప్యాకేజీ-II (రూ. 405 కోట్లు)

రోడ్ నెం 45 జంక్షన్:

  • ఫిలింనగర్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు 2 లేన్ అండర్ పాస్
    జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్ నెం 45 వైపు 2 లేన్ ఫ్లైఓవర్
READ MORE  Praja Vijayotsavalu | ఈనెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు 

ఫిలింనగర్ జంక్షన్:

  • మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుంచి రోడ్ నెం 45 జంక్షన్ వైపు 2 లేన్ అండర్ పాస్
  • ఫిల్మ్ నగర్ జంక్ష‌న్‌ నుంచి మహారాజా అగ్రసేన్ Jn వైపు 2 లేన్ ఫ్లైఓవర్ .

మహారాజా అగ్రసేన్ జంక్షన్:

  • క్యాన్సర్ హాస్పిటల్ జంక్ష‌న్‌ నుంచి ఫిల్మ్ నగర్ జంక్ష‌న్‌ వైపు 2 లేన్ అండర్ పాస్
  • ఫిల్మ్ నగర్ జంక్ష‌న్‌ నుంచి రోడ్ నంబర్ 12 వైపు 2 లేన్ ఫ్లైఓవర్

క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్:

  • KBR పార్క్ వైపు నుండి మహారాజా అగ్రసేన్ Jn వైపు 2 లేన్ అండర్ పాస్
  •  మహారాజా అగ్రసేన్ జంక్షన్ నుండి రోడ్ నెం.10 వైపు 2 లేన్ ఫ్లైఓవర్

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *