Wednesday, December 31Welcome to Vandebhaarath

Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

Spread the love

Hyderabad MMTS | తక్కువ చార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించాల‌నుకుంటున్న హైద‌రాబాద్ వాసుల‌కు చుక్కెదుర‌వుతోంది. ఎంఎంటీఎస్ ప్రయాణికులకు క్ర‌మంగా దూరం అవుతోంది. నానాటికీ సర్వీసులు తగ్గిపోతుండ‌డంతో ఉద్యోగులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు ఎదురవుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఎంఎంటీఎస్ సర్వీసుల‌ను త‌గ్గిస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఎంఎంటీ ఎస్ రైళ్లపై ప్రయాణికు్లో విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చింది. ఇందుకు కార‌ణం.. తక్కువ ధ‌ర‌లో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు ఈ లోక‌ల్ ట్రైన్స్ వ‌ల్ల క‌లుగుతుంది. కరోనాకు ముందు రోజూ 175 సర్వీసులతో రెండున్నర లక్షలమందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర‌వేసిన ఎంఎంటీఎస్ రైళ్లు.. ఇప్పుడు సుమారు వంద సర్వీసులకు పైగా తగ్గి 70 వరకు నడుపుతోంది. ప్ర‌తిరోజు సుమారు 50 వేల మందికి ప్రయాణ సేవలను అందిస్తున్నాయి.

Highlights

ఇదిలా ఉండ‌గా రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని అందిస్తోంది. ఫ‌లితంగా మ‌హిళ‌లంద‌రూ హైద‌రాబాద్ ప‌రిధిలో ఎక్స్ ప్రెస్‌,ఆర్డినరీ బ‌స్సుల్లో ఉచితంగా ప్ర‌యాణిస్తున్నారు. దీంతో ఎంఎంటీఎస్ రైళ్ల‌లో ప్ర‌యాణించే మ‌హిళ‌ల సంఖ్య భారీగా ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో పలు రూట్లలో ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్యను సగానికి సగం తగ్గించిన‌ట్లు తెలుస్తోంది.

మెట్రో రైళ్ల‌ ఫ్రీక్వెన్సీ తగ్గింపుతో ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. కొందరు ఆటోలను ఆశ్రయిండ‌గా మ‌రికొంద‌రు ఆర్టీసీ బ‌స్సులలో ప్ర‌యాణిస్తున్నారు. ఎంఎంటీఎస్ రూట్లలో ప్రధానమైన ఫలక్నుమా-లింగంపల్లి మార్గంలో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ప్రయాణికులకు ఎంఎంటీఎస్ లు అందుబాటులో ఉండ‌డం లేద‌ని ప్ర‌యాణికులు ఆరోపిస్తున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *