EPF Balance Check | మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ను ఇన్ని రకాలుగా చెక్ చేసుకోవచ్చు..
EPF Balance Check | మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్.. బ్యాలెన్స్ ఎంత ఉందో నాలుగు విధాలుగా చెక్ చేసుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఉమాంగ్ యాప్ ద్వారా
ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లలో ఉమాంగ్ యాప్ (Umang app) ను డౌన్ లోడ్ చేసుకొని తమ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. ప్రభుత్వం సేవలను సులువుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వమే ఈ యాప్ ను ప్రవేశపెట్టింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఉమాంగ్ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా పీఎఫ్ పాస్ బుక్ తో పాటు క్లెయిమ్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. క్లెయిమ్ స్టేటస్ గురించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసిన తరువాత మీ ఫోన్ నంబర్ తో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (EPF Login) పూర్తి చేసి పూర్తి సేవలను ఉపయోగించుకోవచ్చు. పీఎఫ్ తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలు కూడా ఈ యాప్ ను /ఉపయోగించుకోవచ్చు.
ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా..
ఈపీఎఫ్ఓ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారా కూడా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. సర్వీసెస్ సెక్షన్ లోకి వెళ్లి ఎంప్లాయిసీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.. ఆ తర్వాత పీఎఫ్ పాస్ బుక్ (EPF PassBook) ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే లాగిన్ పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అనంతరం మీ యూఏఎన్ నంబరుతో పాటు పాస్వర్డ్ ను ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మీ పాస్ బుక్ కనిపిస్తుంది. ఇందులో అన్ని వివరాలను చూడవచ్చు.
మిస్డ్ కాల్ ద్వారా
EPF balance check on mobile : ఈపీఎఫ్ చందాదారులు 011-22901406 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే మీ ఫోన్ నంబర్, బ్యాంక్ అకౌంట్, ఆధార్, యూఏఎన్ నంబర్ కు లింక్ అయి ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ లింక్ కాకపోతే మీరు పనిచేసే కంపెనీని అడిగి లింక్ చేయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎస్ఎంఎస్ తో తెలుసుకోండి..
EPF Balance Check : ఉద్యోగి యూఏఎన్ నంబర్ ఈపీఎఫ్ఓలో రిజిస్టరయి ఉంటే 77382 99899 నంబర్ కు ఎస్ఎంఎస్ పంపి పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG ఫార్మాట్ లో మీరు మెసేజ్ పంపించాలి. UAN అంటే మీ యూఏఎన్ నంబర్. ENG అంటే ఇంగ్లిష్ భాషలో వివరాలు కావాలని అర్థం. ఒకవేళ మీకు తెలుగు భాష లో వివరాలు తెలుసుకోవాలంటే EPFOHO UAN TEL అని మెసేజ్ పంపించాలి. దీనివల్ల తెలుగులోనే మీ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు (సీబీటీ) 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ను 8.25 శాతానికి పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.. దీంతో ఈపీఎఫ్ చందదారులు తమ పీఎఫ్ ఖాతాల్లో ఉన్న బ్యాలెన్స్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తాజా వడ్డీ రేటు పొందుతారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటిత్రైమాసికంలో ఈ వడ్డీ మొత్తం మీ పీఫ్ ఖాతాల్లో క్రెడిట్ అవుతుంది. అంటే ఏప్రిల్-మే మధ్య వడ్డీ జమ అయ్యే అవకాశం ఉంది. దేశంలో సుమారు 6.5 కోట్ల మంది ఈపీఎఫ్ చందాదారులున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..