2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది?
How many seats will BJP win? | ప్రఖ్యాత ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు సుర్జిత్ భల్లా, ప్రస్తుతం జరుగుతున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ 2019 లో సాధించిన సీట్లను అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆయన ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుర్జిత్ భల్లా వివరాలను పంచుకున్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో 330 నుంచి 350 సీట్లు గెలుచుకోగలదని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 303 సీట్లు సాధించగా బీజేపీ మిత్రపక్షాలు 353 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కేవలం 52 సీట్లకే పరిమితమైంది.
” సుర్జిత్ భల్లా మాట్లాడుతూ.. బీజేపీ సొంతంగా 330 నుంచి 350 సీట్లు సాధిస్తుందని తెలిపారు. ఇది కేవలం 2019 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఐదు నుంచి ఏడు శాతం సీట్లు పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలకు ఎన్ని సీట్లు వస్తాయి?
How many seats will BJP win? : సుర్జిత్ భల్లా ప్రకారం, కాంగ్రెస్ 44 సీట్లు లేదా 2014 ఎన్నికల్లో గెలిచిన దానికంటే 2 శాతం తక్కువ సీట్లు సాధించవచ్చు. “(ప్రతిపక్ష) కూటమిలో అతిపెద్ద సమస్య నాయకత్వం . కాంగ్రెస్ కూటమిలో నాయకత్వ లేమి బిజెపికి అనుకూలంగా మారింది. ప్రతిపక్ష ఇండియా కూటమి మాస్ అప్పీల్ లేదా పటిష్టమైన నాయకుడిని ఎంపిక చేసి ఉంటే ప్రధాని మోడీని కాస్తంత అయినా ఢీకొని ఉండేవారు. అప్పుడు అది పోటీగా ఉంటుందని నేను భావిస్తున్నాను” అని సూర్జిత్ భల్లా న్యూస్ ఛానెల్‌తో అన్నారు.
బీజేపీకి దక్షిణాది బూస్ట్
బిజెపి సాంప్రదాయకంగా బలహీనమైన పార్టీగా ఉన్న తమిళనాడులో బిజెపి కనీసం ఐదు స్థానాలను గెలుచుకోవచ్చని సూర్జిత్ భల్లా అంచనా వేశారు. “తమిళనాడులో బిజెపి ఐదు స్థానాలకు పైగా గెలుస్తుందనడంలో ఆశ్చర్యంలేదు కేరళలో ఒకటి లేదా రెండు స్థానాలను కైవసం చేసుకుంటుంది. అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా గత ఎన్నికలతో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ ఓట్ల శాతం పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్జిత్ భల్లా కూడా అదే అంచనా వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మోదీ మాట్లాడుతూ, “మా ఓట్ల శాతం రెట్టింపు అయిన తెలంగాణను చూడండి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి అత్యధిక ఎంపీలున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 2024లో (లోక్‌సభ ఎన్నికలు) ఓట్ల శాతం పెరుగుతుందని నేను నమ్ముతున్నాను. సీట్లు కూడా పెరుగుతాయి.” అని ప్రధాని మోదీ వెల్లడించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..