Horoscope Weekly | ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..

Horoscope Weekly | ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందో తెలుసుకోండి..

Horoscope Weekly | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. 2024 మే 26 ఆదివారం నుంచి జూన్ 1 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారంలో సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. విద్యార్థులకు యోగ కాలము. ముఖ్యమైన నిర్ణయాలు స్నేహితులతో చర్చించి తీసుకుంటారు. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. Insurance ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. చెడు ఆలోచనలకు మరియు వ్యసనాలకు దూరంగా ఉండండి. Shares లో పెట్టుబడులు పెట్టకూడదు. మీరు ఇతరుల మీద చూపించే ప్రేమ మరియు ఆరాటం వల్ల నష్టపోయే అవకాశం కలదు. మీ వ్యాపార భాగస్వాములతో తగాదాలు కొంత తగ్గుముఖం పడతాయి. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. భూమికి సంబంధించిన తగాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. Food items వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండను. రాజకీయ నాయకులతో కలహం అంత మంచిది కాదు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా పడతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలము. దుర్గ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారంలో నూతన భూ గృహ కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వార ప్రారంభంలో కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. Emitation jewellery వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. సంతాన ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయం. Bank Loans మంజూరు అవుతాయి. గృహంలో అలంకరణ వస్తువులకై ధన వ్యయము చేయవలసి వస్తుంది. Printing Press వారికి కొంత నష్టం కలుగుతుంది. క్రీడారంగంలో ఉన్న వారికి అవకాశాలు చేజారిపోతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలము. ఆర్థికపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నూతన వ్యాపారస్థులకు వ్యాపార ఎదుగుదల ఉంటుంది. మహాలక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈ వారంలో మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీలు ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు. ధనపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. స్నేహితుల సలహాలు సూచనలు పాటిస్తారు. విద్యార్థులకు యోగధాయకమైన కాలము. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్తలు వింటారు. దూర ప్రాంత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాలుపంచుకుంటారు. పోలీస్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు ఉండును. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాల వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. అప్పు కొంత తీరుస్తారు. తలనొప్పితో మరియు రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. Real Estate వ్యాపారస్తులకు యోగ కాలము. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి 16 శనివారం వరకు..

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారంలో సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. సోదరుల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఏ నిర్ణయమైనా Emotionalగా కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు ఏర్పడతాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. Navy & Defence Department ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. Furniture వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన Permissions మంజూరు అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణ సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మతిమరుపు వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకుంటారు మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

 

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఈ వారం ప్రారంభంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. యాత్రల కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. మానసిక ప్రశాంతతతో కాలాన్ని గడుపుతారు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. Medical Agencies వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

కన్య రాశి వారికి ఈ వారంలో పోలీసు శాఖ వృత్తిలో ఉన్నవారికి స్థానచలనం కలిగే అవకాశం కలవు. స్నేహితులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. తల్లి ఆరోగ్యం కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. మీ పిల్లల ప్రవర్తన వలన మీరు ఇబ్బంది పడే అవకాశం కలదు. స్థిరాస్తి కొనుగోలుకై మీ జీవిత భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాల వ్యాపారస్తులకు నష్టములు కలుగును. Joints pains ఒక సమస్యగా మారుతుంది. తండ్రి తరపు ఆస్తి చేతికి అందుతుంది. పాత బాకీలు కొంత వసూలు అవుతాయి. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. వారం చివరలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. జమానతు సంతకాలు చేయకూడదు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam Makar Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

తూల రాశి

తులా రాశి వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో తగాదాలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవడం చెప్పదగిన సూచన. Skin infectionsతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. యోగ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. Oil వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. రవాణా శాఖ ఉద్యోగస్తులకు స్థాన చలనము కలిగే అవకాశాలు కలవు. తల్లి తరపు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీలు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు చేయి జారిపోతాయి. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. వడ్డీ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. Land Registrations వాయిదా పడతాయి. వివా ప్రయత్నాలు వాయిదా పడతాయి. గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి పని భారం అధికంగా ఉంటుంది. పొత్తికడుపు లేదా నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయం సాధిస్తారు. మిఠాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. స్నేహితులకు ఎదురైన సమస్యలకు పరిష్కారాన్ని చూపుతారు. దైవ కార్యక్రమములకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో తగాదాలు ఏర్పడతాయి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరులు మీ మాటలతో ఏకీభవిస్తారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. Chit Fund వ్యాపారస్తులకు గతంలో చేసిన పొరపాట్లకు తగు మూల్యం చెల్లించవలసి వస్తుంది. నూతన వ్యాపార ప్రారంభముకై అడుగులు వేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ వారంలో కుల వృత్తి లేదా తండ్రి వ్యాపారము చేసే వారికి యోగ కాలము. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తండ్రి అంగీకారాన్ని అడుగుతారు. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. సంతాన ప్రవర్తనను చూసి ఆందోళన చెందుతారు. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎదుగుదల ఉంటుంది. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును . Home Needs వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. ఆర్థికపరమైన ఎదుగుదల కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. చండి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారంలో ప్రయాణాలలో విలువైన వస్తువులు జారవిడుచుకునే అవకాశం కలదు. గృహము నందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు పనిభారం ఉండును. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. ఈ రాశి స్త్రీలు బంగారం కొనుగోలు చేస్తారు. కండరాల నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మతిమరుపు వలన సమస్యలు వస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. విద్యార్థులు తమ కష్టాన్ని నమ్ముకోవడం ద్వారా విజయం సాధించగలుగుతారు. Rice mill వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. పిల్లలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే అవకాశం కలదు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  ఈ వారం రాశి ఫలాలు.. నవంబర్ 5 నుంచి 11వరకు..

కుంభ రాశి

Horoscope Weekly  కుంభ రాశి వారికి ఈ వారంలో సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. జూదం వలన నష్టపోతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు Income tax నుండి నోటీసులు అందుకునే అవకాశం కలవు. విదేశాలలో నివసించే ఒక స్నేహితుని సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది. Software ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. ధనపరమైన ఇబ్బందులు తొలగడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఏ పని చేసినా నిజాయితీగా ధర్మంగా చెయ్యాలి అనే ఆలోచన బలపడుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారంలో అప్పు కొంత తీర్చగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పాత బాకీలు కొంత వసూలు అవుతాయి. ముఖ్యమైన విషయాలు మరచిపోకూడదు. సంతానం కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. శత్రువులని కూడా మంచి మనసుతో చేరదీస్తారు. photography fieldలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. శరీరం బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. తీర్థయాత్రలు వాయిదా పడతాయి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. నూతన వధూవరులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. Paints & Chemical వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. ప్రభుత్వానికి మరియు భూమికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు ఏర్పడతాయి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

Weekly Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *