Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ మౌనం ఎందుకు? : హిమంత బిస్వా శర్మ
Hindus in Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడులకు సంబంధించి కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ( Himanta Biswa Sarma ) ప్రశ్నించారు. జార్ఖండ్‌కు బిజెపి ఎన్నికల కో-ఇంఛార్జిగా ఉన్న శర్మ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాంచీలో జరిగిన పార్టీ సంస్థాగత సమావేశానికి హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేసిన శర్మ, అక్కడ పరిస్థితి భయంకరంగా ఉందని, చెప్పలేనంతగా ఉందని వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరిస్తుందని, పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
“ప్రస్తుతం, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది,” శర్మ బిర్సా ముండా విమానాశ్రయంలో విలేకరులతో అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితిపై కాంగ్రెస్ మౌనంగా ఉందని విమర్శించిన శర్మ, “పార్టీ నాయకులు గాజాలో మైనారిటీల కోసం నిరసనలు చేశారు, కానీ వారు బంగ్లాదేశ్‌లో హిందువుల కోసం ఎన్నిసార్లు మాట్లాడారు? కాంగ్రెస్ వారికే అండగా ఉందని నిరూపితమైంది. ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు.. కానీ అది హిందువులతో కాదని అన్నారు.
Hindus in Bangladesh బంగ్లాదేశ్ నుంచి ప్రజలు రావడం గురించి శర్మ మాట్లాడుతూ, సరిహద్దు దాటడానికి ఎవరినీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని అన్నారు. “ఇది పరిష్కారం కాదు. ప్రజలను సరిహద్దులు దాటడానికి మేము అనుమతించలేం. అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించడం ద్వారామాత్రమే పరిష్కారమవుతుదని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న తూర్పు ప్రాంతం అంతటా హిందూ జనాభా తగ్గిందని శర్మ పేర్కొన్నారు. అస్సాంలో హిందువుల జనాభా 9.23 శాతం తగ్గిందని, బంగ్లాదేశ్‌లో 13.5 శాతం తగ్గిందని హిమంత బిస్వా శర్మ తెలిపారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..