Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలో వీఐపీ సంస్కృతిని అంతం చేసేందుకు, మంత్రులు.. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని రద్దు చేస్తున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం ప్రకటించారు. . పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల కరెంటు బిల్లులు చెల్లించే #VIPCulture రూల్‌కు ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు.
తాజా ప్రకటన తర్వాత, సీఎం శర్మతో సహా మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ సొంత విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఈ వివరాలను వెల్లడించారు. హిమంత బిస్వా శర్మ జూలై 1న వారి విద్యుత్ బిల్లులను చెల్లించే మొదటి వ్యక్తిగా ఉంటాని చెప్పిన ఆయన.. మిగిలిన మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
“జూలై 2024 నుండి, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ సొంత విద్యుత్ బిల్లులు చెల్లించాలి అని తెలిపారు. మా మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారుల నివాసాలకు లేదా సచివాలయంలోని నివాసాలకు విద్యుత్ బిల్లులు చాలా కాలంగా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇది 75 సంవత్సరాల వారసత్వంగా వస్తోంది. విద్యుత్ బిల్లు చెల్లింపులో ప్రభుత్వ ఉద్యోగులకు వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికే ఈ కొత్త నిబంధన విద్యుత్ బోర్డు నష్టాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, జూలై 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, మంత్రులందరూ తమ సొంత బిల్లులను చెల్లిస్తారని అస్సాం ముఖ్యమంత్రి తెలిపారు.
విద్యుత్ పొదుపు చర్యలు..
సిఎం సచివాలయం, హోం, ఆర్థిక శాఖలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాత్రి 8 గంటలకు ఆటోమెటిక్ గా విద్యుత్ సరఫరాను ఆటోమెటిక్ గా నిలిపివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,000 ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలలో ఈ కార్యక్రమం ఇప్పటికే అమలు చేస్తున్నారు. “అన్ని ప్రభుత్వ సంస్థలను క్రమంగా సోలార్ పవర్‌కి మార్చడమే మా లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా మెడికల్ కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని అని అస్సాం సిఎం చెప్పారు.
జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్
రాష్ట్ర సచివాలయ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) .. జనతా భవన్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్ట్ కింద, రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వం 2.5 MW సామర్థ్యం గల గ్రిడ్-కనెక్ట్ చేయబడిన సోలార్ PV వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. జనతా భవన్ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా నెలకు సగటున 3 లక్షల యూనిట్ల విద్యుత్ వస్తుంది. ప్రాజెక్టు కింద పెట్టిన ₹ 12.56 కోట్ల విలువైన పెట్టుబడిని నాలుగేళ్లలో రికవరీ చేయాలని భావిస్తున్నారు. ప్రాజెక్ట్ అమలుతో, అస్సాం సెక్రటేరియట్ కాంప్లెక్స్ రోజువారీ వినియోగం కోసం పూర్తిగా సౌర-ఉత్పత్తి విద్యుత్ మీద ఆధారపడే భారతదేశపు మొట్టమొదటి పౌర సచివాలయంగా మారింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..