Moinabad temple vandalised | మొయినాబాద్‌లో శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హనుమాన్ ఆలయాన్ని (Hanuman Temple) అపవిత్రం చేసి హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్‌లోని తుల్‌కట్ట గేటు వద్ద ఉన్న ఆలయ ప్రాంగణంలోకి అగంతకులు ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీల్ చేశారు. క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను గుర్తించడంలో పోలీసులకు సహకరిస్తున్నారు. కేసును ఛేదించేందుకు పోలీసులు పరిసరాల్లోని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
హైదరాబాద్ – బీజాపూర్ రహదారిపై రాస్తారోకో..
మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ పరిధిలో హనుమాన్ ఆలయం లో విగ్రహాలను (Hanuman Idol) ధ్వంసం చేసిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున బీజాపూర్ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే గుర్తించిన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
The Hindutva activists, who participated in a dharna, demanded strict punishment for the thieves who destroyed the idol at the Hanuman temple at the gate of Tolkatta village. pic.twitter.com/M0ogtGa4UB
— Konda Vishweshwar Reddy (@KVishReddy) December 21, 2024
తోల్కట్ట గ్రామాన్ని సందర్శించిన ఎంపీ
temple vandalised in Tolkatta : తోల్కట్ట గ్రామాన్ని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి శనివారం సందర్శించారు. తోల్కట్ట గ్రామంలో హనుమాన్ గుడి విధ్వంసానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే ఆయన గ్రామానికి వెళ్లి సంఘటన గురించి అడిగి ఆరా తీశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పటికీ దేవాలయాల వద్ద పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదన్నారు. నగరం నడిబొడ్డున కూడా ఇలాంటి సంఘటననే జరిగినప్పటికీ పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఎంపీ మండిపడ్డారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..