Posted in

గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం.. కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి

Spread the love

కోచ్చి: కేరళ (Kerala) లోని కొచ్చి లో కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యు లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కారు నడిపే వ్యక్తి గూగుల్ మ్యాప్ (Google Map) సాయంతో డ్రైవింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. భారీ వర్షం, దృశ్యమానత తక్కువగా ఉండటంతో ఈ ప్రమాదం (Accident) సంభవించినట్లు భావిస్తున్నారు. స్థానిక వార్తల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారు గోతురుత్ ప్రాం తంలో పెరియార్ నదిలో పడిపోయింది. ఈ ప్రమా దంలో యువ వైద్యులు అద్వైత్ (29), అజ్మల్ (29) మృతిచెందారు.

ఈ ప్రమా దంలో కారులో ఉన్న మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారు ఆస్ప త్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన ఈ ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉంది. కాగా కారు డ్రైవర్ గూగుల్ మ్యాప్ సాయంతో డ్రైవింగ్ చేస్తున్నాడని.. అయితే భారీ వర్షం, తక్కువ దృశ్యమానత కారణంగా డ్రైవర్ నదిని చూడలేకపోయాడని.. కారు బ్యాలెన్స్ తప్పి నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. సమాచారం అందు కున్న స్థానికులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.


ఇప్పుడు మీ వాట్సప్ లో వందేభారత్ అప్ డేట్స్ చూడండి 

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో  సంప్రదించవచ్చు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *