Gold and Silver Prices Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold and Silver Prices Today: బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తరచూ పెరుగుతూ.. తగ్గుతూ ఉంటాయి. పండుగలు, వివాహాలు, శుభకార్యాల సమయంలో బంగారం, వెండిని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. సెప్టెంబరు 24న ఆదివారం బంగారం ధర ₹ 10 పెరిగింది . వెబ్‌సైట్ గుడ్‌రిటర్న్స్ ప్రకారం, ఒక గ్రాము 22K బంగారం ధర ₹ 5,495 కాగా 24K బంగారం ధర ₹ 5,995 గా ట్రేడ్ అవుతుంది.
దేశంలో బంగారం ధరలు ఆదివారం కూడా స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ.100 పెరిగి.. రూ. 54,950కి చేరింది. శనివారం ఈ ధర రూ. 54,850గా ఉంది. అలాగే 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ.1,000 పెరిగి.. రూ. 5,49,500గా ఉంది. ఒక గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ.5,495 వద్ద కొనసాగుతోంది.
అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.110 వృద్ధి చెంది.. రూ.59,950 కి చేరింది. నిన్న ఈ ధర రూ.59,840 గా ఉండేది. ఇక 100 గ్రాముల (24 క్యారెట్లు) పుత్తడి ధర రూ.1,100 పెరిగి.. రూ.5,99,500 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఆదివారం పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,100గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,100 గా ఉంది.
కోల్‌కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,950, 24 క్యారెట్ల గోల్డ్.. 59,950 ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
Gold rate today Hyderabad: హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,950 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,950గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నం, వరంగల్ లోనూ ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు ఆదివారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ.7,580 గా ఉంది. కిలో వెండి ధర రూ.300 పెరిగి 75,800కి చేరింది. శనివారం ఈ ధర రూ.75,500 గా ఉండేది.
Silver rate today in Hyderabad : హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.79,300 పలుకుతోంది. వెండి ధర కోల్‌కతాలో రూ. 75,500, బెంగళూరులో రూ. 74,250గా ట్రేడ్ అవుతోంది.
సెప్టెంబర్ 24న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
నగరం | 22K బంగారం ధర | 24K బంగారం ధర |
---|---|---|
ఢిల్లీ | 55,100 | 60,100 |
ముంబై | 54,950 | 59,950 |
కోల్‌కతా | 54,950 | 59,950 |
చెన్నై | 55,210 | 60,230 |
బెంగుళూరు | 54,950 | 59,950 |
హైదరాబాద్ | 54,950 | 59,950 |
విజయవాడ | 54,950 | 59,950 |
విశాఖపట్నం | 54,950 | 59,950 |
వరంగల్ | 54,950 | 59,950 |
వెండి ధరలు
ఆదివారం వెండి ధర రూ.30 పైసలు పెరిగింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక గ్రాము వెండి ధర రూ. 75.80. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో, 10 గ్రాముల వెండి ధర రూ.758. చెన్నై, బెంగళూరులో వెండి ధర రూ. 793 రూ.742.50. గా ఉంది.
‘K’ లేదా క్యారెట్ అనేది బంగారం స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే పదం. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 24కే బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. ఇతర లోహాలు అందులో ఏమాత్రం ఉండవు. ఇక 22K బంగారం లో రాగి, జింక్ వంటి ఇతర లోహాలు కొద్దిమేర కలిసి ఉంటాయి. అయితే ఈ 22కే గోల్డ్ తోనే భరణాలను తయారు చేస్తారు.
ధరల్లో మార్పులు ఎందుకు?
బంగారం, వెండి, ప్లాటినం వంటి అలంకరణకు సంబంధించిన లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాలపై ఈ ధరల మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్స్ లో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ఈ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.