Friday, August 1Thank you for visiting

Indore Lok Sabha | ఎన్నిక‌ల్లో ఓటువేస్తే రుచిక‌ర‌మైన జిలేబీలు, ఐస్ క్రీమ్‌లు అంద‌జేస్తార‌ట‌..

Spread the love

Indore Lok Sabha : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఫుడ్ షాపుల యజమానులు వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభ సమయంలో ఓటు వేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలు, ఐస్‌క్రీం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ (Indore Lok Sabha) లో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ వాణిజ్య సంస్థల సమావేశంలో ఉచిత ఆహార పదార్థాలను అందించాలని నిర్ణయించినట్లు దుకాణ యజమానులు తెలిపారు.

స‌మావేశం అనంతరం ఆశిష్‌ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటింగ్‌లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపాలనుకుంటున్నామని, ఇందుకోసం వాణిజ్య సంస్థల సహకారం తీసుకుంటున్నామని ఆయ‌న‌ అన్నారు. నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఓటు వేసే ప్రజలకు ఉచితంగా పోహా, జిలేబీలు అందజేస్తామని నగరంలోని ప్రముఖ చాట్-చౌపాటీ ఫుడ్ హబ్ “56 షాప్” మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుంజన్ శర్మ తెలిపారు.

ఈ స‌మ‌యం లో ఓటు వేసిన సీనియర్ సిటిజన్లు, జీవితంలో మొదటిసారి ఓటు వేసిన య‌వ ఓట‌ర్ల‌కు మా చాట్-చౌపాటీలో పోహా, జిలేబీతో పాటు ఉచిత ఐస్ క్రీం అందిస్తామ‌ని ఈ ఆఫర్‌ను పొందేందుకు, వారు ఓటువేసిన త‌రువాత వేలిపై చెరగని సిరా గుర్తును చూపించాలి. తెలిపారు. నగరంలోని మరికొన్ని వాణిజ్య సంస్థలు ఉదయం వేళల్లో ఓటు వేసే ప్రజలకు నూడుల్స్, మంచూరియన్ వంటి రుచికరమైన వంటకాలను ఉచితంగా అందజేస్తామని అధికారులు తెలిపారు.

కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం (Indore Lok Sabha)లో 69 శాతం ఓటింగ్ నమోదైంది. రానున్న ఎన్నికల్లో ఈ ప్రాంతంలో 25.13 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *