Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..
1 min read

Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Spread the love

Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA)  అధికార ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెంగాల్‌ రూ.468 కోట్లు (Flood Relief Funds) విడుదల చేసింది.

కాగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను కొద్దిరోజుల క్రితం వరద ముంచెత్తిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వరదలు బీభత్సం స్రుష్టించాయి. ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇంకా తేరుకోలేదు. . రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్రమే మరిన్ని నిధులుమంజూరు చేసి ఆదుకోవాలని వరద బాధితులు కోరుతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *