Floating screen in Ayodhya | రామ మందిరం ఈవెంట్‌ను వీక్షించేందుకు భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్
అయోధ్య: అయోధ్యలోని రామమందిరంలో రామ్ లాలా ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సమీపిస్తున్నందున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యను కనీవిని ఎరుగని రీతిలో అధ్యాత్మిక కేంద్రంగా (నవ్య, భవ్య, దివ్య) అలంకరించేందుకు సన్నాహాలు చేస్తోంది.
యూపీ CMO అధికారిక ప్రకటన ప్రకారం, UP ప్రభుత్వం.. శ్రీరామ ఆలయ ప్రారంభోత్సవ సన్నాహాల్లో భాగంగా చౌదరి చరణ్ సింగ్ ఘాట్‌లో దేశంలోనే అతిపెద్ద తేలియాడే స్క్రీన్ (Floating screen in Ayodhya ) ను నిర్మిస్తోంది. ఇది తరువాత ఆర్తి ఘాట్‌లో అమర్చబడుతుంది. దీనిపై రాముడి ప్రాణ ప్రతిష్ఠను కార్యక్రమాలతోపాటు అయోధ్య అభివృద్ధి ప్రయాణం గురించి ప్రదర్శిస్తుంది. .
అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ ఆగస్టులో సెంచరీ హాస్పిటాలిటీ-మెగావర్స్ అసోసియేట్‌తో అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకం చేసిందని అధికారిక ప్రకటన పేర్కొంది.
ఈ ఫ్లోటింగ్ స్క్రీన్ వల్ల సందర్శకులు, స్థానికులు జనవరి 22న శ్రీరామ మందిరంలో జరిగే ప్రాణ్-ప్రతిష్ఠను, ఆ తర్వాత ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను చక్కగా వీక్షించేందుకు వీలుంటుందని తెలిపింది. దేశ, విదేశాల నుండి సందర్శకులకు అయోధ్యకు సంబంధించిన గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పిస్తుంది.
11,00 అడుగుల సైజ్ లో భారీ స్క్రీన్
సెంచరీ హాస్పిటాలిటీ-మెగావర్స్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్, అక్షయ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇది ఇప్పటివరకు దేశంలో నిర్మించిన అతిపెద్ద ఫ్లోటింగ్ స్క్రీన్ అవుతుందని అన్నారు. ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్‌ఎస్) పర్యవేక్షణలో 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షిప్ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. స్క్రీన్ పరిమాణం 1100 చదరపు అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్‌లో ప్రారంభమైన ఫ్లోటింగ్ స్క్రీన్ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి కానుంది.
అక్షయ్ ఆనంద్ నుండి అందిన సమాచారం ప్రకారం, విశాఖపట్నం నుండి 60-70 మంది హస్తకళాకారులు జనవరి 19 నాటికి రికార్డు సమయంలో ఫ్లోటింగ్ స్క్రీన్‌ను నిర్మించడానికి పగలు రాత్రి శ్రమిస్తున్నారు.
“ప్రధాని మోదీ (PM Modi), సీఎం యోగి ల మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ప్రకారం ఈ పని జరుగుతోంది. ప్రస్తుతం, ఇది బయోడీజిల్‌తో నడుతుస్తుంది. అయితే భవిష్యత్తులో దీనిని సోలార్‌తో నిర్వహించాలనేది ప్రణాళిక ఉంది. ప్రస్తుతం చౌదరి చరణ్ సింగ్ ఘాట్ నుండి లక్ష్మణ్ ఘాట్ వరకు దాదాపు 3 కి.మీ. ఇది దూరంలో ఉన్న లోతైన నీటి సమీపంలో మాత్రమే దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ సరయు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ తేలియాడే స్క్రీన్ పరిధి కూడా పెరుగుతుంది,” అని అక్షయ్ ఆనంద్ అన్నారు. ఫ్లోటింగ్ స్క్రీన్ అయోధ్య సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
సిఎం యోగి ఆదిత్యనాథ్ విజన్‌కు అనుగుణంగా, అయోధ్యను 8 ఇతివృత్తాల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అయోధ్యను గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన నగరంగా రూపొందించడానికి యత్నిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మొదటగా, జనవరి 22న ఈ స్క్రీన్‌పై రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠను ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత అయోధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పౌరాణిక కథలతోపాటు ప్రాముఖ్యతను వివరిస్తారు.
ఫ్లోటింగ్ రెస్టారెంట్
ప్రాణప్రతిష్ఠ తర్వాత 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను నిర్మించే యోచనలో ఉన్నట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. ఇందుకు సంబంధించి ఎంఓయూపై సంతకాలు చేశారు. ఫ్లోటింగ్ స్క్రీన్ విజయవంతమైతే ఆ తర్వాత, కంపెనీ ఈ ప్లాన్‌పై పని చేయడం ప్రారంభిస్తుంది. ఈ రెస్టారెంట్ పర్యాటకులను ఆకర్షించేందుకుఅత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్నారు. అయోధ్యకు ప్రయాణం చిరస్మరణీయమైనది, రామ్ కథను ప్రదర్శించే రెస్టారెంట్‌లో స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక ప్రకటన పేర్కొంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..