Electric Ordinary Buses | నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులొస్తున్నాయ్..
Electric Ordinary Buses in Hyderabad | హైదరాబాద్ మహానగరంలో సమీప భవిష్కత్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే పరుగులుపెట్టన్నాయి. పాత బస్సుల స్థానంలో కొత్త డీజీల్ బస్సులకు బదులుగా పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) భావిస్తోంది. ఇటీవల విద్యుత్ మెట్రో బస్సులను ప్రవేశపెట్టగా దసరా (Dasara ) కల్లా విద్యుత్ ఆర్డినరీ బస్సులు కూడా రాబోతున్నాయి.ప్రస్తుతం ఉన్న ఆర్డినరీ బస్సులకు విభిన్నంగా ఆకర్షనీయంగా చూడడానికి ఏసీ బస్సుల్లా కనిపించబోతున్నాయి.
హైదరాబాద్ లో ఇప్పటికే ఏసీ, నాన్ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చిన ఆర్టీసీ తాజాగా ఆర్డినరీ బస్సులను కూడా తీసుకురాబోతోంది. ప్రయాణికుల స్పందన ఆధారంగా విడతల వారీగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులను ఏ మార్గాల్లో తిప్పాలన్న అంశంపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
500లకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో102 ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెడుతున్నాయి. ఇంకా 438 సమకూర్చుకునేందుకు ఆర్టీసీ ప్రణాళికలుసిద్ధం చేసుకుంటోంది. 100 విద్యుత్తు బస్సులను కొనుగోలు చేసి ఆర్డినరీలు (Electric Ordinary Buses ) సర్వీస్‌లుగా నడపాలని ప్రతిపాదించింది. అయితే మొదటి దశలో కేవలం 10 బస్సులను ప్రయోగాత్మకంగా నడిపించనున్నారు. ఇక ఈ విద్యుత్ బస్సులకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్ల (EV Charging Points) కోసం రూ.17 కోట్లు ఆర్టీసీ ఖర్చుచేస్తోంది. ప్రస్తుతం 102 ఎలక్ట్రిక్ బస్సుల్లో 77 ఏసీ, 25 నాన్ ఏసీవి ఉన్నాయి.
గ్రేటర్ పరిధిలోని కంటోన్మెంట్, మియాపూర్ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌సీయూ, బీహెచ్‌ఈఎల్‌లోనూ చార్జింగ్ స్టేషన్లు కూడా సిద్ధమవుతున్నాయి. జేబీఎస్‌లోనూ ఛార్జింగ్ యూనిట్ పూర్తయింది. వీటిలో పూర్తి స్థాయిలో విద్యుత్తు సరఫరా జరిగితే కొత్త బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..