Election Notification | ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ
Election Notification | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. మొత్తం ఏడు విడతలలో దేశంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే మూడు దశల ఎన్నికల నోటిఫికేషన్లు ఈసీ విడుదల చేసింది. ఇక ఏప్రిల్ 18న, గురువారం నాలుగో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల (Election Notification) చేయనుంది. నాలుగో విడతలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ (25 స్థానాలు), తెలంగాణ (17), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఉత్తర్ ప్రదేశ్ (13), బిహార్ (5), ఝార్ఖండ్ (4), ఒడిశా (4), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1) లో నోటిఫికేషన్ రానుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గురువారం ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలుకు తుది గడువు ఇచ్చారు. ఈ 26న నామినేషన్ల పరిశీలన, ఈ29న నామినేషన్ల ఉప సంహరణతో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నాలుగో దశలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో మే 13న పోలింగ్ జరగనున్నాయి. లోక్ సభ స్థానాలతోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్‌కు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4 న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఏపీ, తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు
- ఏప్రిల్ 18 – ఎన్నికల నోటిఫికేషన్ జారీ
- ఏప్రిల్ 18 – నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
- ఏప్రిల్ 25 – నామినేషన్లు దాఖలుకు తుది గడువు
- ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉప సంహరణ
- మే 13 – ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు
- జూన్ 4 – ఓట్ల లెక్కింపు
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..