
Earthquake in Delhi-NCR : పాకిస్తాన్‌లో ఈరోజు (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఢిల్లీ పరిసరప్రాంతంలో ప్రకంపనలు ఏర్పడ్డాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.
దేశయ వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం నాడు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
ఇది పాకిస్థాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:28 గంటలకు ఉద్భవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నైరుతి భాగంలో డేరా ఘాజీ ఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖను ఉటంకిస్తూ జి0యో న్యూస్ నివేదించింది.
అయితే భూకంపం (Earthquake) తీవ్రత 5.4గా నమోదైందని, ఇది భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లను ప్రభావితం చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌లో మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఇండియా నేషనల్ సిస్మాలజీ తెలిపింది.
కాగా 2005లో, 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం పాకిస్తాన్, కాశ్మీర్‌లో వేలాది మందిని బలిగొంది.
ఢిల్లీ నగరంతోపాటు పరిసర ప్రాంతాల్లో రెండు వారాల్లో తేలికపాటి ప్రకంపనలు సంభవించడం ఇది రెండోసారి. ఆగష్టు 29 న, ఆఫ్ఘనిస్తాన్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది భూమి ఉపరితలం క్రింద 255 కిలోమీటర్ల దూరంలో ఉద్భవించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..