Earthquake in Delhi -NCR | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు
Earthquake in Delhi-NCR : పాకిస్తాన్‌లో ఈరోజు (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం 12:58 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఢిల్లీ పరిసరప్రాంతంలో ప్రకంపనలు ఏర్పడ్డాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.
దేశయ వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం నాడు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులతో పాటు రాజధానిలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది.
ఇది పాకిస్థాన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:28 గంటలకు ఉద్భవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో నమోదైందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని నైరుతి భాగంలో డేరా ఘాజీ ఖాన్ ప్రాంతానికి సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వాతావరణ శాఖను ఉటంకిస్తూ జి0యో న్యూస్ నివేదించింది.అయితే భూకంపం (Ea...