DUSU Election Results 2025 : ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలు ఈరోజు ప్రకటించారు. DUలోని నార్త్ క్యాంపస్‌లోని మల్టీపర్పస్ హాల్, యూనివర్సిటీ స్పోర్ట్స్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో కీలకమైన పదవులు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పదవులకు – బీజేపీ మద్దతు గల ABVP, కాంగ్రెస్ అనుబంధమైన NSUI, వామపక్ష కూటమి – SFI, AISA ల మధ్య హోరాహోరీ పోటీ జరగింది.
DUSU అధ్యక్ష పదవికి కీలక పోటీదారులు- NSUI నుండి జోస్లిన్ నందితా చౌదరి, లెఫ్ట్ అలయన్స్ (SF, I AISA) నుండి అంజలి, ABVP నుండి ఆర్యన్ మాన్ బరిలో నిలిచారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం (DUSU) ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది, అధ్యక్ష పదవి కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)కి చెందిన ఆర్యన్ మాన్ కాంగ్రెస్ మద్దతుగల నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాకు చెందిన జోసెలిన్ నందితా చౌదరిపై విజయం సాధించారు.
గురువారం జరిగిన DUSU ఎన్నికల్లో దాదాపు 40 శాతం ఓటింగ్ నమోదైందని వార్తా సంస్థ PTI నివేదించింది. పోలింగ్ రెండు షిఫ్టులలో జరిగింది – ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు , అలాగే మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7.30 వరకు జరిగింది. యూనివర్సిటీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ABVP ,NSUI మధ్యనే నెలకొంది.
వామపక్ష అనుబంధ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) DUSU ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయి.
అభ్యర్థులు ఎవరు?
NSUI బుద్దిస్ట్ స్టడీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన జోస్లిన్ నందితా చౌదరిని అధ్యక్ష పదవికి నిలబెట్టగా, ABVP లైబ్రరీ సైన్స్ విభాగానికి చెందిన ఆర్యన్ మాన్‌ను బరిలో నిలిపింది.
SFI-AISA కూటమి ఇంద్రప్రస్థ కాలేజ్ ఫర్ ఉమెన్ విద్యార్థిని అంజలిని అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టింది.
ఎవరు ఏమి హామీ ఇచ్చారు?
NSUI: నందితా చౌదరి ప్రచారం ఎక్కువగా హాస్టల్ కొరత, క్యాంపస్ భద్రతపై దృష్టి పెట్టింది.
ABVP: ఆర్యన్ మాన్ సబ్సిడీ మెట్రో పాస్‌లు, క్యాంపస్ అంతటా ఉచిత Wi-Fi, వికలాంగులకు యాక్సెసిబిలిటీ ఆడిట్‌లు ,మెరుగైన క్రీడా సౌకర్యాలను హామీ ఇచ్చారు.
SFI-AISA: లింగ సున్నితత్వం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల పునరుద్ధరణ వంటి అంశాలపై అంజలి ప్రచారం చేసింది.
కీలక విజేతలు:
- అధ్యక్షుడు: ఆర్యన్ మాన్ (ABVP)
- వైస్ ప్రెసిడెంట్: రాహుల్ ఝాన్స్లా (NSUI)
- కార్యదర్శి: కునాల్ చౌదరి (ABVP)
- జాయింట్ సెక్రటరీ: దీపికా ఝా (ABVP)
అన్ని పోస్టులకు DUSU 2025 తుది ఫలితాల విభజన
అధ్యక్షుడు:
- ఎస్ఎఫ్ఐ-ఐఎస్ఎ: 5385
- ఏబీవీపీ: 28841
- ఎన్.ఎస్.యు.ఐ: 12645
- INd (NSUI రెబెల్): 5522
ఉపాధ్యక్షుడు:
- ఎబివిపి: 20547
- ఎన్.ఎస్.యు.ఐ: 29339
- SFI-AISA: 4163
కార్యదర్శి:
- ఏబీవీపీ: 23779
- ఎస్ఎఫ్ఐ-ఐఎస్ఎ: 9535
- ఎన్.ఎస్.యు.ఐ: 16177
జాయింట్ సెక్రటరీ:
- ఎబివిపి: 21825
- ఎన్.ఎస్.యు.ఐ: 17380
- SFI- AISA: 8425
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.