Posted in

కుక్క కరిచిన గేదె పాల అమ్మకం

Spread the love
  •  ఆ పాలు తాగి దూడ మృతి.. 
  • ఆస్పత్రులకు పరుగులు తీసిన గ్రామస్తులు

ఓ వ్యక్తి చేసిన తింగరి పని ఊరు మొత్తాన్ని టెన్షన్ పెట్టింది. దాదాపు 300 మంది ఆస్పత్రికి పరుగులు తీశారు. పరిస్థితి అర్థం చేసుకున్న అధికారులు గ్రామంలోనే అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కొమురం భీం జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో గేదెపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి.. గాయపరిచింది. ఈ విషయం తెలిస్తే తన వద్ద పాలు ఎవరూ కొనరేమోనని గేదె యజమాని నాన్నయ్య.. ఆందోళన చెందాడు. అందుకే ఆ విషయాన్ని దాచి యథావిధిగా ఊరంతటికీ పాలు అమ్మాడు.

Highlights

అయితే ఆ గేదె పాలు తాగిన దూడ మృతి చెందడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో కొద్ది రోజులుగా గేదె పాలు తాగిన 300 మంది బాధితులు ఆందోళన చెందారు. తమకు ఏమైనా అవుతుందేమో అన్న భయంతో ఆస్పత్రికి పరుగులు తీశారు. వారికి టెస్టులు నిర్వహించిన ఆస్పత్రి సిబ్బంది.. యాంటి రేబిస్ టీకాలు వేశారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో అధికారులు గ్రామ పంచాయతీ ఆఫీస్ లో అత్యవసరంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు గ్రామం మొత్తాన్ని భయపెట్టిన నాన్నయ్యను అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. అతడు జనం ప్రాణాలతో చెలగాటమాడాడు. మరి గ్రామస్థులు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో చూడాలి.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *