Railway Fare | సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీ లభిస్తుందా? బడ్జెట్‌లో ఏం ఉండనుంది.?

Railway Fare | సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీ లభిస్తుందా? బడ్జెట్‌లో ఏం ఉండనుంది.?

Railway Fare | భారతీయ రైల్వేలు రైలు ఛార్జీలపై సీనియర్ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను 2020 మార్చిలో నిలిపివేసింది. ఈ రాయితీ కింద గతంలో మహిళా సీనియర్ సిటిజన్లకు 50 శాతం తగ్గింపు, పురుషులు, ట్రాన్స్‌జెండర్, సీనియర్ సిటిజన్లకు 40 శాతం తగ్గింపు ఇచ్చింది.

అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌లో ఏదైనా ప్రత్యేక ప్రకటన వెలువడవచ్చని అన్ని వర్గాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. పన్నుకు సంబంధించి ప్రకటన చేస్తారని మధ్యతరగతి వర్గాలు ఎదురుచూస్తున్నారు. కాగా, సీనియర్ సిటిజన్లు కూడా బడ్జెట్‌పై ప్రత్యేక అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ప్రభుత్వం రైల్వే రాయితీలను పునరుద్ధరించే చాన్స్ ఉందని సీనియర్ సిటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2020లో భారతీయ రైల్వేలు రైలు ఛార్జీలపై సీనియర్ సిటిజన్‌లకు అందించే రాయితీలను నిలిపివేసింది. ఇందులో మహిళా సీనియర్ సిటిజన్‌లకు 50 శాతం తగ్గింపు, పురుషులు, ట్రాన్స్‌జెండర్ సీనియర్ సిటిజన్‌లకు 40 శాతం తగ్గింపు ఉన్నాయి. రాయితీ రద్దుతో సీనియర్ సిటిజన్లు ఇప్పుడు టికెట్ల (Railway Fare) పై పూర్తి ఛార్జీలు చెల్లిస్తున్నారు.  కాగా ఈసారి బడ్జెట్ లో స్వల్పంగా రాయితీ ఇవ్వనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

READ MORE  Vande Bharat Sleeper: కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ఆగస్టు 15 నుండి ఈ మార్గాలలో నడుస్తుంది.. వివరాలు ఇవీ..

రూ.కోట్లలో రాయితీ

రైల్వే ప్రకారం, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, ట్రాన్స్‌జెండర్లు, 58 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలను సీనియర్ సిటిజన్‌లుగా పరిగణిస్తారు. దురంతో, శతాబ్ది, జన శతాబ్ది, రాజధాని రైళ్లు వంటి అన్ని వర్గాల మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సీనియర్ సిటిజన్ రైల్వే రాయితీ అందుబాటులో ఉంది. పలు నివేదికలు, RTI ప్రకారం, సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీని ఉపసంహరించుకోవడం ద్వారా రైల్వేలు భారీ ఆదాయాన్ని పొందాయి. భారతీయ రైల్వేలు ఎనిమిది కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుంచి రూ. 5,062 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, అందులో రూ. 2,242 కోట్లు రాయితీలు లేకపోవడం వల్ల వచ్చాయి. ఈ విభాగంలో 4.6 కోట్ల మంది పురుషులు, 3.3 కోట్ల మంది మహిళా ప్రయాణికులు, 18 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

READ MORE  vande bharat sleeper coach | వందేభార‌త్ స్లీప‌ర్ రైలు అబ్బురప‌రిచే అత్యాధునిక ఫీచ‌ర్లు..

2022లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ సీనియర్ సిటిజన్‌లకు రైల్వే రాయితీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయితే రాయితీలను మళ్లీ తీసుకువస్తే ప్రభుత్వంపై రూ.కోట్లలో ఆర్థిక భారం పెరుగుతుందని తెలిపారు. డిసెంబరు 2023లో, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..  2019-20లో ప్రయాణికుల టిక్కెట్‌లపై రూ. 59,837 కోట్ల సబ్సిడీని అందించిందని, ఇది ప్రతి రైలు ప్రయాణీకుడికి సగటున 53% రాయితీ అని పేర్కొన్నారు.

ఇదిలా వుండగా  నాలుగు కేటగిరీల వికలాంగులు, 11 కేటగిరీల రోగులు, ఎనిమిది కేటగిరీల విద్యార్థులతో సహా వివిధ వర్గాలకు అదనపు రాయితీలతో పాటు ప్రయాణికులందరికీ ఈ సబ్సిడీ కొనసాగుతోంది.

READ MORE  మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *