Friday, April 11Welcome to Vandebhaarath

Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..

Spread the love

Dibrugarh Express accident  | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం మరియు 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయని, మరిన్ని వైద్య బృందాలు అంబులెన్స్‌లను అక్కడికి తరలిస్తున్నట్లు చెప్పారు.
రైల్వే సీనియర్ అధికారులు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

కాగా రైలుప్ర‌మాదంలో మృతుల కుటుంబాలకు ₹ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి ₹ 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి ₹ 50 వేలు అందించ‌నున్నారు.

READ MORE  Republic Day 2025 : గణతంత్ర వేడుకల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ప్రళయ్ క్షీపణి

హెల్ప్ లైన్ నెంబ‌ర్లు..

  • ల‌క్నో- LJN: 8957409292
  • గోండా – GD: 8957400965
  • కమరర్షియల్ కంట్రోల్ ( Commercial Control): 9957555984
  • Furkating (FKG): 9957555966
  • మరియాని(Mariani) (MXN): 6001882410
  • సిమల్గురి(Simalguri) (SLGR): 8789543798
  • Tinsukia (NTSK): 9957555959
  • డిబ్రూగడ్(Dibrugarh) (DBRG): 9957555960

రద్దు అయిన, దారి మళ్లించిన రైళ్ల జాబితా..

  • రైలు నెంబ‌ర్ : 5094 (GD to GKP) – ర‌ద్దు
  • రైలు నెంబ‌ర్ : 5031 (GKP to GD) – ర‌ద్దు
  • రైలు నెంబ‌ర్ : 15707 (KIR to ASR) – దారి మళ్లింపు – వ‌యా MUR-AY
  • రైలు నెంబ‌ర్ : 15653 (GHY to SVDK) – దారి మళ్లింపు – వ‌యా MUR-AY
  • రైలు నెంబ‌ర్ : 12555 (GKP to BTI) – దారి మళ్లింపు – వ‌యా BNY-GD
  • రైలు నెంబ‌ర్ : 12553 (SHC to NDLS) – దారి మళ్లింపు – వ‌యా BNY-GD
  • రైలు నెంబ‌ర్ : 12565 (DBG to ANVT) – దారి మళ్లింపు – వ‌యా MUR-AYC
  • రైలు నెంబ‌ర్ : 12557 (MFP to ANVT) – దారి మళ్లింపు – వ‌యా MUR-AYC
  • రైలు నెంబ‌ర్ : 15273 (RXL to ANVT) – దారి మళ్లింపు – వ‌యా BNY-GD
  • రైలు నెంబ‌ర్ : 19038 (BJU to BDTS) – దారి మళ్లింపు – వ‌యా BNY-GD
  • రైలు నెంబ‌ర్ : 22537 (GKP to LTT) – దారి మళ్లింపు – వ‌యా BNY-GD
  • రైలు నెంబ‌ర్ : 13019 (HWH to KGM) – దారి మళ్లింపు – వ‌యా BNY-GD
  • రైలు నెంబ‌ర్ : 14673 (JYG to ASR) – దారి మళ్లింపు – వ‌యా MUR-AYC-BB
READ MORE  Maha Kumbh ends today | ఘనంగా ముగిసిన మహా కుంభమేళా.. 45 రోజులు, 65 కోట్ల మంది భక్తులు, రూ. 3 లక్షల కోట్ల ఆదాయం, ఖర్చులు & మరిన్ని

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *